Prabhas Movies : రిలీజ్‌కు పోటీ పడుతున్న ప్రభాస్ సినిమాలు..

ఒకటి కాదు రెండు కాదు.. మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు రెబల్ స్టార్.. ఒకప్పుడు ఒక్క సినిమాకి 2,3 ఏళ్లు టైమ్ తీసుకున్న ప్రభాస్.. ఇప్పుడు ఒకేసారి 4 సినిమాల్ని లైనప్ చేశారు..

Prabhas Movies : రిలీజ్‌కు పోటీ పడుతున్న ప్రభాస్ సినిమాలు..

Prabhas Movies To Release Back To Back

Prabhas Movies: ఒకటి కాదు రెండు కాదు.. మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు రెబల్ స్టార్. ఒకప్పుడు ఒక్క సినిమాకి 2,3 ఏళ్లు టైమ్ తీసుకున్న ప్రభాస్.. ఇప్పుడు ఒకేసారి 4 సినిమాల్ని లైనప్ చేశారు. ఎలాగూ ‘రాధే శ్యామ్’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరి ఈ లవ్ స్టోరీ తర్వాత రిలీజ్ అయ్యే సినిమా ఏంటి..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకప్పుడు సినిమా సినిమాకీ బాగా గ్యాప్ తీసుకునే ప్రభాస్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని లైన్లో పెట్టారు. లేట్ అవుతుందని కమిట్ అవ్వడం కాకుండా ఈ సినిమాల్ని కూడా జెట్ స్పీడ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాల్ని అంతే స్పీడ్‌గా రిలీజ్‌కి కూడా రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ ‘రాధే శ్యామ్’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక్కడ ముచ్చట అంతా మిగతా మూడు సినిమాల గురించే.

‘రాధే శ్యామ్’ కంప్లీట్ కాకుండానే ‘ఆదిపురుష్’ సినిమా స్టార్ట్ చేశారు ప్రభాస్. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్‌తో చేస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఫుల్ స్పీడ్‌లో షూటింగ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి నుంచే షూటింగ్ మొదలుపెట్టిన ‘ఆదిపురుష్’ సినిమా 2022 ఆగస్ట్‌కి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ‘రాధే శ్యామ్’ తర్వాత అనౌన్స్ చేసిన సినిమా కాబట్టి.. ‘రాధే శ్యామ్’ తర్వాత ‘ఆదిపురుష్’ రిలీజ్ అవుతుందని అనుకున్నారు అందరూ. కానీ మైథలాజికల్ మూవీ కాబట్టి.. ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపే మరో సినిమా రిలీజ్ ప్లాన్‌లో ఉన్నారు ప్రభాస్.

‘ఆదిపురుష్’ ఆగకుండా షూటింగ్ జరుపుతూనే.. ‘సలార్’ సినిమా స్పీడ్ కూడా పెంచేశారు ప్రభాస్. ప్రశాంత్ నీల్ అనౌన్స్ చేసిన ‘సలార్’ సినిమాలో ది మోస్ట్ వయెలెంట్ మ్యాన్‌గా ప్రభాస్‌ని చూపించబోతున్నారు. అసలు ప్రశాంత్ నీల్ సినిమా అనౌన్స్ చెయ్యకముందు వరకు ‘రాధే శ్యామ్’ తరవాత ‘ఆదిపురుష్’ రిలీజ్ అవుతుందేమో అనుకున్నారు ఆ సినిమా స్పీడ్ చూసి. కానీ ప్రశాంత్ నీల్ షూటింగ్ స్పీడ్ చూసి ప్రభాస్ కూడా ‘సలార్’ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు లాక్‌డౌన్ తర్వాత షూటింగ్ కూడా ‘సలార్’ నే కంప్లీట్ చెయ్యబోతున్నారు ప్రభాస్. ఇలాగే ప్రశాంత్ నీల్ స్పీడ్ కంటిన్యూ అయితే నెక్ట్స్ ఇయర్ సమ్మర్‌కి ‘సలార్’ రిలీజ్ గ్యారంటీ. అంటే ‘ఆదిపురుష్’ కన్నా ముందే ‘సలార్’ రిలీజ్ అవుతుందన్నమాట.

‘సలార్’, ‘ఆదిపురుష్’ తర్వాత వీటన్నింటి కంటే ముందే కమిట్ అయిన నాగ్ అశ్విన్ సినిమా రిలీజ్ అవుతుంది. దీపికా పదుకోన్ హీరోయిన్‌గా అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్‌లో తెరకెక్కబోతున్న ఈ పాన్ వరల్డ్ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌లో బిజీగా ఉంది. ఈ సెప్టెంబర్ నాటికి అఫీషియల్‌గా సినిమా పనులు కూడా స్టార్ట్ చేస్తోంది నాగ్ అశ్విన్ టీమ్. సో.. నాగ్ అశ్విన్ సినిమా మినిమమ్ నెక్ట్స్ ఇయర్ ఎండ్‌కి గానీ, 2023 సమ్మర్‌కి గానీ రిలీజ్ అయ్యే ఛాన్సుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌లతో ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఫీస్ట్ రెడీ అవుతోంది.