AP Rains: ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. పిడుగులతో కూడిన వానలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.
AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. పిడుగులతో కూడిన వానలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడరాదని సూచన చేసింది. సురక్షిత ప్రదేశాల్లోనే తలదాచుకోవాలని చెప్పింది.
Also Read: వైఎస్ జగన్తో రాజధాని రైతుల భేటీ.. భూసేకరణ నిలిపివేస్తామని హామీ
