Rag Mayur : కమెడియన్ నుంచి హీరో వరకు.. 5 ఏళ్ళు అంటూ ఎమోషనల్ పోస్ట్..

రాగ్ మ‌యూర్‌కు సినిమా బండి మంచి ఫేమ్ ఇచ్చింది. (Rag Mayur)

  • Published on- May 17, 2026 / 06:49 PM IST

Rag Mayur

Rag Mayur : ప్రస్తుతం విభిన్న కథలతో, పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తెలుగు నటుల్లో రాగ్ మ‌యూర్‌ ఒకరు. 2021 లో ‘సినిమా బండి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాగ్ మయూర్ ఆ సినిమా హిట్ అవ్వడంతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. దాంతో సినీ పరిశ్రమలోకి వచ్చి ఐదేళ్లు పూర్తి అయిందంటూ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అలాగే మీడియాతో మాట్లాడారు.

రాగ్ మ‌యూర్‌కు సినిమా బండి మంచి ఫేమ్ ఇచ్చింది. ఆ త‌ర్వాత వీరాంజ‌నేయులు విహార‌యాత్ర‌, కీడా కోలా, మిత్రమండలి, పరదా సినిమాల్లో మెప్పించాడు. శుభం సినిమాలో గెస్ట్ పాత్రలో మళ్ళీ మరిడేష్ బాబుగా కనిపించి నవ్వించాడు. గాంధీతాత సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించి అదరగొట్టాడు. సూపర్ హిట్ హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయ‌త్‌’కు రీమేక్‌గా వ‌చ్చిన ‘సివ‌రాప‌ల్లి’లో హీరోగా అందర్నీ అలరించాడు. త్వరలో హీరోగా అనుమాన పక్షి అనే సినిమాతో రాబోతున్నాడు.

Also Read : Tanish Alladi : పవన్ కళ్యాణ్ తో ఒకప్పటి హీరో తనీష్ మీటింగ్.. ఫోటోలు వైరల్..

ఈ సందర్భంగా రాగ్ మయూర్ మాట్లాడుతూ.. నా మొదటి సినిమాకే మ‌రిడేశ్‌ బాబు లాంటి అద్భుతమైన పాత్ర రావడం నా అదృష్టం. అంతకంటే మంచి డెబ్యూ రాదు. సినిమా బండి న‌టుడిగా నాకు గుర్తింపు తీసుకొచ్చింది. ఆ అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులకు, నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కెల‌కు కృతజ్ఞతలు అని అన్నారు.

అలాగే.. సివరాపల్లి హిట్ త‌ర్వాత నాకు మరింత ఆత్మ విశ్వాసం వ‌చ్చింది. చాలా మంది ద‌ర్శ‌కులు న‌న్ను దృష్టిలో పెట్టుకుని పాత్ర‌ల‌ను రాస్తున్నామని చెప్పారు. నేను థియేట‌ర్ ఆర్టిస్ట్ కాబట్టి నట‌న‌లో విభిన్న కోణాల‌ను అన్వేషించే అవ‌కాశం ద‌క్కింది అని అన్నారు.

Also Read : Chiranjeevi : 70 ఏళ్ళ ఏజ్‌లో జిమ్‌లో మెగాస్టార్ కష్టాలు.. 158వ సినిమా కోసం.. ముహూర్తం ఎప్పుడంటే?

ప్రస్తుతం రాగ్ మయూర్ డైరెక్ట‌ర్ గౌరి నాయుడు జ‌మ్ము తెర‌కెక్కిస్తోన్న ‘గ‌రివిడి లక్ష్మి’లో బుర్ర‌క‌థ క‌ళాకారుడిగా క‌నిపించ‌బోతున్నారు. అలాగే అనుమాన పక్షి అనే సినిమాతో రాబోతున్నాడు. గ‌రివిడి లక్ష్మి చాలా ఎక్సైటింగ్‌, ఛాలెంజింగ్ పాత్ర అని, దాని కోసం చాలా ప్రిపేర్ అయి న‌టించాను అని తెలిపారు రాగ్ మయూర్.