Raghava Lawrence – Chandramukhi 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 2005 లో తెరకెక్కిన హారర్ మూవీ ‘చంద్రముఖి’. అప్పటిలో ఈ సినిమా హారర్ మూవీస్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది. చంద్రముఖిగా హీరోయిన్ ‘జ్యోతిక’ అందర్నీ బయపెట్టిసింది. 18 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుంది. అయితే మధ్యలో ‘నాగవల్లి’ అంటూ చంద్రముఖి కథతో ఒక సినిమా వచ్చినప్పటికీ అది సక్సెస్ కాలేదు. చంద్రముఖి అండ్ నాగవల్లి రెండు చిత్రాలను తెరకెక్కించింది కూడా ఒకడే దర్శకుడు పి వాసు.
Tholi Prema : పవన్ తొలిప్రేమ క్లైమాక్స్ చూస్తే అమితాబ్కి చిరాకు వచ్చిందట.. కోపంతో ఆయన ఏమి చేశాడట!
ఇప్పుడు వస్తున్న ఈ సీక్వెల్ ని కూడా పి వాసునే తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోగా రాఘవ లారెన్స్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక చంద్రముఖిగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసేశారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని జరుపుతున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. చంద్రముఖి గది తాళాన్ని ఈ ఏడాది వినాయక చవితి నాడు తీస్తాం అంటూ ప్రకటించారు. ఈసారి చంద్రముఖిని పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్లు కూడా ప్రకటించారు. తమిళ్, తెలుగుతో పాటు మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.
We are thrilled to announce that the doors to the much awaited sequel Chandramukhi 2 🗝️ will be open from Ganesh Chaturthi 🤗✨
Releasing in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada!
#Chandramukhi2 🗝️ pic.twitter.com/hoM7BXxWp2— Raghava Lawrence (@offl_Lawrence) June 29, 2023
Maa Oori Polimera 2 : మా ఉరి పొలిమేర-2 కోసం వరుణ్ తేజ్.. ఏం చేస్తున్నాడో తెలుసా..?
ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోంది. ఇక మన ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కాగా వాసు అండ్ రాఘవ కాంబినేషన్ లో ‘శివలింగ’ అనే హారర్ మిస్టరీ థ్రిల్లర్ వచ్చి తెలుగు తమిళంలో సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ వస్తుండడంతో ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.