రాఘ‌వ లారెన్స్ “కాంచ‌న‌- 3” డేట్ ఫిక్స్

  • Publish Date - March 16, 2019 / 07:08 AM IST

కోలీవుడ్ డాన్సింగ్ స్టార్‌ రాఘవా లారెన్స్‌ మరోసారి సౌత్‌లో సూపర్‌ హిట్ హరర్‌ కామెడీ జానర్‌లో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ‘ముని’ సిరీస్‌లో ‘కాంచన 3’ రెడీ అవుతోంది. లారెన్స్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ సినిమా ఫస్ట్‌లుకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాను తెలుగులో లైట్‌హౌస్‌ మూవీమేకర్స్‌ LLP పతాకంపై బి. మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్‌ బ్యానర్‌లో రాఘవ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ఓవియా, వేదిక, కోవై సరళ, కబీర్‌ దుహన్‌ సింగ్, సత్యరాజ్, శ్రీమాన్‌ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాను మే 1న రిలీజ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు ముందుగానే పూర్తవుతుండటంతో ఏప్రిల్ 19ననే  కాంచన 3 సినిమాను రిలీజ్‌ చేసేందుకు నిర్ణయించారు. ఇదిలా ఉంటే అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో కాంచ‌న చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌బోతున్నాడ‌ట లారెన్స్. శ‌ర‌త్ కుమార్ పాత్ర కోసం ప‌లువురు ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోల‌తో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.