×
Ad

Rahul Ramakrishna : ప్రియదర్శిని అలా కంపేర్ చేసి అగౌరవ పరచొద్దు.. బెస్ట్ ఫ్రెండ్ గురించి రాహుల్ పోస్ట్..

తన స్నేహితుడు ప్రియదర్శిని అలా కంపేర్ చేసి అగౌరవ పరచొద్దు అంటూ రాహుల్ రామకృష్ణ వేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

  • Published On : July 17, 2023 / 02:50 PM IST

Rahul Ramakrishna post on Priyadarshi Pulikonda gone viral

Rahul Ramakrishna : టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి (Priyadarshi Pulikonda) తెలుగులో ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఆల్మోస్ట్ ఇద్దరి కెరీర్ ఒక సమయంలోనే పుంజుకుంది. అదికూడా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమాతో కావడం విశేషం. పెళ్లిచూపులు సినిమాతో ప్రియదర్శి మంచి గుర్తింపు సంపాదించుకుంటే, ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి మూవీతో రాహుల్ మంచి ఫేమ్ ని సంపాదించుకున్నాడు. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్.

Theatrical Movies : ఈ వారం తెలుగులో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

ప్రస్తుతం వీరిద్దరూ ఒక పక్క సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోపక్క మెయిన్ లీడ్ తో కూడా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఇక ఇటీవల ప్రియదర్శి బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా రాహుల్ ‘ఇంటింటి రామాయణం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చాడు. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. దీంతో కొంతమంది నెటిజెన్లు వీరిద్దర్నీ కంపేర్ చేస్తూ కొన్ని పోస్టులు వేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఒక పోస్ట్ పై రాహుల్ రియాక్ట్ అయ్యాడు.

Baby Movie : అదిరిపోయిన ‘బేబీ’ కలెక్షన్స్.. ఫుల్ ప్రాఫిట్స్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లు తెలుసా?

తనని ప్రియదర్శితో కంపేర్ చేయొద్దని, అలా చేయడం తనని అగౌరవ పరిచినట్లు అవుతుందని పేర్కొన్నాడు. తను గొప్ప నటుడు. ఇలా కంపేర్ చేయడం చీప్ గా ఉందంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ పోస్టుకి కొందమంది అభిమానులు రియాక్ట్ అవుతూ.. ‘మాకు నువ్వు కూడా గ్రేట్ బ్రో’ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాహుల్ నటించిన ఇంటింటి రామాయణం మూవీ విషయానికి వస్తే.. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ లో రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఆహాలో సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతుంది.