Theatrical Movies : ఈ వారం తెలుగులో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

సామజవరాగమన, బేబీ సినిమాలు గత రెండు వారాలు మంచి విజయం సాధించాయి. ఈ వారం కూడా అన్ని చిన్న, మీడియం సినిమాలే ఉన్నాయి.

Theatrical Movies : ఈ వారం తెలుగులో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

July 3rd Week Theatrical Releasing Movies List

Theatrical Movies :  గత రెండు వారాల నుంచి వచ్చిన సినిమాలు మంచి విజయాలు చూస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు లేకపోయినా అన్ని మీడియం సినిమాలే ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి. సామజవరాగమన, బేబీ సినిమాలు గత రెండు వారాలు మంచి విజయం సాధించాయి. ఈ వారం కూడా అన్ని చిన్న, మీడియం సినిమాలే ఉన్నాయి.

ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు, నందిత శ్వేతా జంటగా నటించిన ‘హిడింబ’ సినిమా జులై 20న రిలీజ్ కాబోతుంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుంది.

Hidimba Movie

30 వెడ్స్ 21 సిరీస్ ఫేమ్ చైతన్య రావు, లావణ్య జంటగా నటించిన ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ జులై 21న థియేటర్స్ లోకి రానుంది. 90లలో ప్రేమ కథలా ఉండబోతుంది ఈ సినిమా.

Annapurna Photo Studio

ఇటీవలే బిచ్చగాడు 2 సినిమాతో హిట్ అందుకున్న విజయ్ ఆంటోనీ ఇప్పుడు ‘హత్య’ సినిమాతో జులై 21న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Hatya Movie

రుహాణి శర్మ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘HER’ జులై 21న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

her movie

బ్రహ్మాజీ తనయుడు సంజయ్, ప్రణవి జంటగా నటించిన స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా జులై 21న రాబోతుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ లా ఈ సినిమా ఉండబోతుంది.

slum dog husband

ఇవే కాక.. అలా ఎలా ఇలా, జిలేబి, నాతో నేను, ఒక్కడే వీరుడు.. అనే చిన్న సినిమాలు జులై 21న రిలీజ్ కాబోతున్నాయి. వీటిల్లో జిలేబి, నాతో నేను సినిమాలు వాయిదా పడే అవకాశం ఉంది.

ఇక హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలాన్‌ దర్శకత్వంలో రాబోతున్న ఒప్పెన్‌ హైమర్‌ సినిమా డబ్బింగ్ లో జులై 20న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై ఇండియాలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరో డబ్బింగ్ సినిమా నాగ ద్వీపం కూడా జులై 22న రిలీజ్ కానుంది.

openheimer movie