AH Movie Song : ‘అ’ సినిమా నుంచి ఇదేనా ఇదేనా మెలోడీ సాంగ్ విన్నారా..

మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ వినేయండి..(AH Movie Song)

  • Published on- October 10, 2026 / 05:55 PM IST

AH Movie Song

AH Movie Song : రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘అ’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ రిలీజ్ చేసారు. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి, అభిషేక్ కె, ఎడిటర్ గ్యారీ BH నిర్మాణంలో సాయి బాలి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమా అక్టోబర్‌ 30న థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా తాజాగా ఈ సినిమా నుంచి ‘ఇదేనా ఇదేనా..’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ ని రిలీజ్ చేసారు. శ్రీచరణ్‌ పాకాల సంగీత దర్శకత్వంలో సుమన్‌ చిక్కాల ఈ పాట రాయగా షణ్ముఖ భరద్వాజ్ పాడారు. మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ వినేయండి..

ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో లిరిసిస్ట్‌ సుమన్‌ మాట్లాడుతూ.. ఇది నా మొదటి పాట. శ్రీచరణ్‌ నాకు ఈ అవకాశం ఇచ్చి నాలోని పాటల రచయితను మీకు ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాడు అని తెలిపాడు. నిర్మాత గ్యారీ బీహెచ్‌ మాట్లాడుతూ.. స్నేహితులు అందరం కలిసి ఈ సినిమా చేస్తున్నాం అని తెలిపారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల మాట్లాడుతూ.. దర్శకుడు సాయి చూడటానికి సున్నితంగా ఉంటాడు కానీ ఈయన చేసిన క్రైమ్‌ థ్రిల్లర్‌ చూస్తే అందరూ షాక్‌ అవుతారు అని తెలిపారు.

Also Read : Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్..

దర్శకుడు సాయి బాలి మాట్లాడుతూ.. రాహుల్‌ విజయ్‌ ఎంతో క్రమశిక్షణ గల ఆర్టిస్ట్‌. నేను ఎంత ఇబ్బంది పెట్టినా సపోర్ట్‌ చేశాడు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాకు ఖర్చు పెట్టారు. సినిమాలో పాటలతో పాటు ఆర్‌ఆర్‌ కూడా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. టైటిల్‌ చుట్టు ఉన్న అమ్మాయి.. అదృశ్యం.. అన్వేషణ, అనుమానం.. అసాంఘీకం… అమానుషం ఈ పదాల మధ్యే ఈ కథ మొత్తం ఉంది. రాహుల్ విజయ్‌ను ఓ సీన్సియర్‌ పోలీస్ ఆఫీసర్‌గా ఈ సినిమాలో చూస్తారు అని తెలిపాడు. అర్చన అయ్యర్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా ఇంట్రెస్టింగ్‌ ఇన్విస్టిగేషన్‌ థ్రిల్లర్‌. నాకెరీర్‌ ప్రారంభంలోనే ఇలాంటి మంచి పాత్ర చేయడం లక్కీగా ఫీలవుతున్నాను అని తెలిపింది.

రాహుల్‌ విజయ్‌ మాట్లాడుతూ.. ఈ పాటకు సంగీతం, సాహిత్యం, పిక్చరైజేషన్‌ అన్ని పర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. డబ్బులంటే సరిపోదు. సినిమాపై ఎమోషన్‌ ఉండాలి. అలాంటి ఎమోషన్‌ ఉన్న నిర్మాతలు వీళ్లు. అక్టోబర్‌ 9న విడుదల కావాల్సిన ఈ సినిమాను బెటర్‌మెంట్‌ కోసం అక్టోబర్‌ 30న ఫర్‌ఫెక్ట్‌ ప్లాన్‌తో విడుదల చేస్తున్నాం. ‘అ’ మిస్టిరీయస్‌ ఇంట్రెస్టింగ్‌ ఇన్విస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా మీ అందరికి థ్రిల్ల్‌ను పంచబోతుంది అని తెలిపారు.