Vijay Deverakonda : అప్పుడు కోపం వచ్చింది.. నా సినిమాలకు టికెట్ హైక్స్ ఉండవు.. రాజమౌళితో సినిమా.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడగా టికెట్ రేట్ల పెంపు పై స్పందించాడు. (Vijay Deverakonda)
Vijay Deverakonda
Vijay Deverakonda : ఇటీవల అనేక సినిమాలకు నిర్మాతలు టికెట్ రేట్లు పెంచుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు కూడా దీనికి పర్మిషన్స్ ఇస్తున్నారు. డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ హైక్స్ తెస్తున్నారు. దీనిపై ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్నా నిర్మాతలు మారట్లేదు. విజయ్ దేవరకొండ అక్టోబర్ 16న రణబాలి సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడగా టికెట్ రేట్ల పెంపు పై స్పందించాడు.
Also Read : Chiranjeevi Ram Charan : చరణ్ – చిరంజీవిపై ఈ రూమర్స్ నిజమేనా? వేరే ఇండస్ట్రీ దర్శకులతో..
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నేను మొదటి నుంచి టికెట్ రేట్ల పెంపుకి వ్యతిరేకం. కానీ నిర్మాతలు వాళ్ళ బిజినెస్ ఆలోచనలతో టికెట్ రేట్లు పెంచుతారు. నా సినిమాల నిర్మాతలతో టికెట్ రేట్లు పెంచొద్దు, ఏమైనా ఉంటె నా రెమ్యునరేషన్ విషయంలో చూసుకుందాం అని చెప్తాను. నేను తక్కువ మంది వచ్చి ఎక్కువ కలెక్షన్స్ రావడం కంటే కూడా ఫుట్ ఫాల్స్ వచ్చి ఎక్కువ మందికి మన సినిమా రీచ్ అయి కలెక్షన్స్ వస్తే మంచిదని నమ్ముతాను.
నేను ఇంటర్ చదివే రోజుల్లో ఐమాక్స్ లో ఒక టికెట్ ధర 80 రూపాయలు ఉండేది. దానికి నేను వారం రోజులు మా నాన్న పాకెట్ మనీ ఇచ్చే పది రూపాయలు దాచుకొని వెళ్ళేవాడిని. ఐమాక్స్ లో సడెన్ గా టికెట్ రేటు 100 రూపాయలు చేసాడు. అప్పుడు నాకు కోపం వచ్చింది టికెట్ రేటు పెంచినందుకు. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా నాకు ఆ బాధ తెలుసు. అందుకే నేను టికెట్ రేట్ల పెంపుకి వ్యతిరేకం. ఫ్యూచర్ లో కూడా నా సినిమాలకు టికెట్ రేట్ల పెంపు ఉండదు. ఒకవేళ నేను రాజమౌళి తో భారీ సినిమా చేస్తే తప్ప. అప్పుడు నా చేతిలో ఉండదు అని అన్నారు.
Also Read : December Fight : డిసెంబర్ లో మిడ్ రేంజ్ హీరోల ఫైట్.. ఒకే రోజు నాలుగు సినిమాలు..
