War 2 Pre Release Event : వర్షం పడినా ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది.. సెలబ్రిటీలు ఓకే.. కానీ ఫ్యాన్స్ తడవాల్సిందేనా?

నేడు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని..

War 2 Pre Release Event

War 2 Pre Release Event : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబోలో బాలీవుడ్ లో భారీగా తెరకెక్కుతున్న స్పై సినిమా వార్ 2 ఆగస్టు 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. నేడు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది. ఓపెన్ గ్రౌండ్స్ లో భారీగా అభిమానుల మధ్య ఈవెంట్ చేయడానికి ప్లాన్ చేశారు.

అయితే హైదరాబాద్ లో గత వారం రోజులుగా డైలీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. యూసుఫ్ గూడాలో కూడా వర్షం పడే ఛాన్సులు ఉందని వెదర్ అప్డేట్స్ చెప్తున్నాయి. అయితే వర్షం పడినా ఈవెంట్ ఆగదని ఈవెంట్ మేనేజర్స్ చెప్తున్నారు. వర్షం పడినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్టేజిపై మాత్రం వాటర్ ప్రూఫ్ టెంట్ వేశారు. దీంతో స్టేజిపై ఉన్నవాళ్లు మాత్రం వర్షం వచ్చినా తడవకుండా మాట్లాడొచ్చు.

Also Read : Mega Heros : జిమ్ లో మెగా కజిన్స్.. పవర్ ఫుల్ లుక్స్.. ఫొటో వైరల్..

ఫ్యాన్స్ తరలి వస్తుండటంతో ఫ్యాన్స్ కిమాత్రం వర్షం పడకుండా పైన ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఒకవేళ వర్షం వచ్చినా ఈవెంట్ జరిగితే ఫ్యాన్స్ మాత్రం వర్షంలో తడవాల్సిందే అని తెలుస్తుంది. ఫ్యాన్స్, ఈవెంట్ నిర్వాహకులు వర్షం రాకూడదనే కోరుకుంటున్నారు. మరి వార్ 2 ఈవెంట్ ఎలా జరుగుతుందో చూడాలి. పలువురు అయితే వరం రోజులుగా వర్షాలు పడుతున్నప్పుడు ఈవెంట్ ఇన్ డోర్ లో ప్లాన్ చేయాల్సింది అని అభిప్రాయపడుతున్నారు.