Raj & DK : బెస్ట్ ఫ్రెండ్స్ ని విడగొట్టిన సమంత.. రాజ్ నిడిమోరుపై డీకే ఆసక్తికర కామెంట్స్..

ఏ సినిమా, సిరీస్ డైరెక్ట్ చేసినా, నిర్మించినా ఈ ఇద్దరూ కలిసే చేసారు. రాజ్ & డీకే ద్వయంగా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. (Raj & DK)

  • Published on- June 16, 2026 / 10:46 AM IST

Raj & DK

Raj & DK : రాజ్ నిడిమోరు ఇటీవల సమంతని పెళ్లి చేసుకోవడంతో పైగా వైరల్ అయ్యారు. కానీ రాజ్ నిడిమోరు తన ఫ్రెండ్ D కృష్ణతో కలిసి చదువుకునే ఏజ్ నుంచి షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఎదిగారు. ఏ సినిమా, సిరీస్ డైరెక్ట్ చేసినా, నిర్మించినా ఈ ఇద్దరూ కలిసే చేసారు. రాజ్ & డీకే ద్వయంగా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. ఈ ఇద్దరి దర్శక నిర్మాణంలో ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్, షోర్ ఇన్ ది సిటీ, సినిమా బండి.. ఇలా అనేక సినిమాలు, సిరీస్ లు వచ్చాయి.

సినీ పరిశ్రమలో ఏ పని చేసినా రాజ్ & డీకే ఇద్దరూ కలిసే చేసేవారు. కానీ మొదటిసారి రాజ్ డీకేని పక్కన పెట్టి తన భార్య సమంత కోసం సినిమా చేసారు. సమంత మెయిన్ లీడ్ గా తెరకెక్కిన మా ఇంటి బంగారం సినిమాకు రాజ్ నిడిమోరు కథని అందించారు. నిర్మాణంలో కూడా భాగమయ్యారు. ఈ సినిమా జూన్ 19న రిలీజ్ అవుతుండటంతో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Also Read : Nag Ashwin : దీపిక తప్పుకుందని కథని మార్చలేము.. ‘కల్కి 2’ అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్..

ఈ ఈవెంట్ కి హాజరయిన డీకే సమంత గురించి, సినిమా గురించి మాట్లాడిన అనంతరం రాజ్ ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

డీకే మాట్లాడుతూ.. రాజ్.. నన్ను వదిలేసి నువ్వు మొదటిసారి పని చేస్తున్నావు. ఈ సినిమా ఒక్కడివే ఒంటరిగా చేస్తున్నావు. నువ్వు మంచి పని చేసే ఉంటావని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ రాజ్ అని అన్నారు. డీకే స్వయంగా మొదటిసారి నన్ను వదిలేసి సినిమా చేసావు అనడంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. రాజ్ తన భార్య సమంత కోసం 25 ఏళ్ళ స్నేహాన్ని పక్కన పెట్టాడని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.