రాజ్ కపూర్ కుమార్తె కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంగత రాజ్‌కపూర్ పెద్దకుమార్తె మితాబ్ బచ్చన్‌ వియ్యపురాలు రీతూ నందా(71) మంగళవారం కన్ను మూశారు..

  • Publish Date - January 14, 2020 / 09:24 AM IST

ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంగత రాజ్‌కపూర్ పెద్దకుమార్తె మితాబ్ బచ్చన్‌ వియ్యపురాలు రీతూ నందా(71) మంగళవారం కన్ను మూశారు..

అలనాటి బాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంగత రాజ్‌కపూర్ పెద్దకుమార్తె రీతూ నందా(71) మంగళవారం కన్ను మూశారు. గతకొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న రీతూ ఢిల్లోలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈమె అమితాబ్ బచ్చన్‌కు వియ్యపురాలు.. రీతు, రాజన్ నందాల కుమారుడు నిఖిల్ నందాను అమితాబ్ కుమార్తె శ్వేత బచ్చన్‌‌‌కిచ్చి వివాహం చేశారు.

రీతు మరణం పట్ల ఇరు కుటుంబాల వారు సోషల్ మీడియా ద్వారా విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు అమితాబ్ ‘మా వియ్యపురాలు, శ్వేత అత్తమ్మ రీతూ నంద హఠాన్మరణం చెందారు. ఉదయం 1.15 నిమిషాలకు ఆమె కన్నుమూశారు’ అని తెలిపారు.

అమితాబ్, ఐశ్వర్యా రాయ్ తదితరులు హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. కాగా రీతూ నందా భర్త రాజన్ నందా 2018లో మరణించిన సంగతి తెలిసిందే. రీతూ మరణంపై ఆమె మరదలు, రిషీ కపూర్‌ భార్య నీతూ కపూర్‌, రిషీ కపూర్ కుమార్తె రిధిమా కపూర్ సైతం సోషల్ మీడియా ద్వారా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.