Raj Nidimoru : అమ్మాయిలు అందరూ పర్ఫెక్ట్ గా లేరు.. సమంత భర్త వ్యాఖ్యలు వైరల్..
ఈ సినిమా మహిళలకు ఎలా రిలేట్ అవుతుంది అని హోస్ట్ అడగ్గా రాజ్ నిడిమోరు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. (Raj Nidimoru)
- Saketh U
- Published on- June 15, 2026 / 06:15 PM IST
Raj Nidimoru
Raj Nidimoru : సమంత మా ఇంటి బంగారం అనే సినిమాతో జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని సమంత తన స్వంత నిర్మాణ సంస్థలో తెరకెక్కించింది. సమంత భర్త రాజ్ నిడిమోరు ఈ కథని రాసి, నిర్మాణంలో కూడా భాగమయ్యారు. దీంతో ప్రమోషన్స్ లో భార్య భర్తలు ఇద్దరూ కలిసి పాల్గొంటున్నారు.
10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా మహిళలకు ఎలా రిలేట్ అవుతుంది అని హోస్ట్ అడగ్గా రాజ్ నిడిమోరు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
Also Read : Vanda Devullu Pre Release Event : ‘వంద దేవుళ్ళు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు..
సమంత భర్త రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. ఈ సినిమా చూసి అమ్మాయిలు రిలేట్ అవ్వాలి. అమ్మాయిలు అందరూ పర్ఫెక్ట్ గా లేరు. అందరిలోనూ తప్పులు ఉంటాయి. కానీ వాళ్ళు పర్ఫెక్ట్ గా కనిపించాలి అనుకుంటారు. ఆ ప్రయత్నమే చాలా మందికి పెద్ద ఛాలెంజ్. అది ఈ సినిమాలో చూస్తారు. అదే రిలేట్ అవుతుంది ఈ సినిమాలో. మీరు పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు అనేదే ఈ సినిమాలో చెప్పేది అని అన్నారు.
ఈ సినిమాలో.. సమంత కోడలిగా అత్తారింటికి వెళ్తే అక్కడ ఆమెకు వంట, ఇంటి పనులు వచ్చు అని అంతా భావిస్తారు కానీ ఆమెకు ఏమి రావు. సమంతకు ఫ్లాష్ బ్యాక్ లో ఏదో యాక్షన్ ఎపిసోడ్ ఉండటం, విలన్స్ నుంచి సమంత యాక్షన్ చేసి ఎలా తన ఫ్యామిలీని కాపాడుకుంది అనే కథాంశంతో ఈ మా ఇంటి బంగారం తెరకెక్కుతుంది.
Also Read : Isakapatnam Trailer : ‘ఇసకపట్నం’ ట్రైలర్ రిలీజ్.. సరికొత్త వెబ్ సిరీస్.. ఎప్పుడు? ఎందులో?
ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..
