Gods and Soldiers : రాజ్ తరుణ్, ప్రేమిస్తే భరత్ మల్టీస్టారర్.. రా & రస్టిక్ సినిమా.. ట్రైజర్ అదిరింది..

ఈ సినిమాతో రాజ్ తరుణ్ తమిళ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. (Gods and Soldiers)

  • Published On : April 11, 2026 / 11:56 AM IST

Gods and Soldiers

Gods and Soldiers : రాజ్ తరుణ్, ప్రేమిస్తే ఫేమ్ భరత్ కలిసి గాడ్స్ & సోల్జర్స్ అనే మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. తమిళ్ లో గోలీసోడా, గోలీసోడా-2 సినిమాల ఫేమ్ దర్శకుడు, ప్రముఖ కెమెరామెన్‌ విజయ్‌ మిల్టన్ డైరెక్ష‌న్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా టీజర్, ట్రైలర్ కాకుండా ట్రైజర్ అని కొత్తగా ఓ వీడియో రిలీజ్ చేసారు.

ఈ ట్రైజర్ చూస్తుంటే కాలేజీ స్టూడెంట్స్, రౌడీల మధ్య జరిగే మాస్, రా & రస్టిక్ కథ అని తెలుస్తుంది. ఈ సినిమాతో రాజ్ తరుణ్ తమిళ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. మీరు కూడా గాడ్స్ & సోల్జర్స్ ట్రైజర్ చూసేయండి..

 

Also Read : Ustaad Bhagat Singh : పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ లోకి వచ్చేస్తుంది.. ఎప్పుడు ఎక్కడ?

ఈ సినిమాలో సునీల్‌, వేదన్‌, అమ్ము అభిరామి, కిషోర్‌, జెఫ్రీరి, భరత్‌ శ్రీని, పాల డబ్బా, విజిత.. పలువురు కీల‌క పాత్ర‌ల్లో నటిస్తుండగా రఫ్‌ నోట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.