Raj Tarun : నన్ను ఆ వివాదంలోకి మళ్ళీ లాగొద్దు.. రియల్ లైఫ్‌లో పెళ్లి పై రాజ్ తరుణ్ కామెంట్స్..

గత నెలలో రెండు సినిమాలు రిలీజ్ చేసిన రాజ్ తరుణ్ సెప్టెంబర్ లో 'భలే ఉన్నాడే' అనే సినిమాతో రాబోతున్నాడు .

Raj Tarun Interesting Comments on Lavanya Issue and Marriage

Raj Tarun : ఇటీవల రాజ్ తరుణ్ లావణ్య అనే అమ్మాయి చేసిన ఆరోపణలతో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు ఈ వివాదంలో నిలిచాడు రాజ్ తరుణ్. అయితే ఈ వివాదం ఉన్నా తన సినిమాల ప్రమోషన్స్ తాను చేసుకుంటున్నాడు. గత నెలలో రెండు సినిమాలు రిలీజ్ చేసిన రాజ్ తరుణ్ సెప్టెంబర్ లో ‘భలే ఉన్నాడే’ అనే సినిమాతో రాబోతున్నాడు .

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ జరగ్గా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఓ మీడియా ప్రతినిధి ఇటీవల జరిగిన వివాదం నుంచి బయటకు వచ్చినట్లున్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడగ్గా రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి బాగున్నాను. ఆ వివాదం నుంచి బయటకు వచ్చానని మీరే అన్నారుగా మళ్ళీ నన్ను ఆ వివాదంలోకి లాగొద్దు. దాని వల్ల నా గత సినిమాలు సరిగ్గా ప్రమోట్ చేయలేదని బాధ పడ్డాను అని అన్నారు. అయితే ఆ వివాదం సడెన్ గా ఆగిపోయింది ఏం చేసారు అని అడగ్గా నేనేం చేయలేదు అని తెలిపాడు రాజ్ తరుణ్.

Also Read : Nani – Sajjanar : TGSRTC ఎండీ సజ్జనార్‌తో నాని స్పెషల్ మీటింగ్..

అలాగే పెళ్లి వివాదంలో ఉన్నారు, సోషల్ మీడియాలో కూడా మీ పెళ్లిపై వార్తలు వస్తున్నాయి. మీరు రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకుంటారా అని ఓ లేడీ మీడియా ప్రతినిధి అడగ్గా రాజ్ తరుణ్.. దాని గురించి చెప్పను సిస్టర్ అని తెలిపాడు. దీంతో రాజ్ తరుణ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు