Nani – Sajjanar : TGSRTC ఎండీ సజ్జనార్‌తో నాని స్పెషల్ మీటింగ్..
సజ్జనార్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో నానికి ఎదురుపడగా ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు.

TGSRTC MD Sajjanar Meets Hero Nani in Airport
Nani – Sajjanar : నాని త్వరలో సరిపోదా శనివారం సినిమాతో రానున్నాడు. ఆగస్టు 29న ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం నాని ఈ సినిమా పాన్ ఇండియా ప్రమోషన్స్ లో ఉన్నాడు. ఇవాళ సాయంత్రం నాని బెంగుళూరులో ప్రమోషన్స్ చేయనున్నాడు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్ లో బెంగుళూరుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో నాని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో TGSRTC ఎండీ సజ్జనార్ ని కలిశారు.
Also Read : Chiranjeevi : ‘విశ్వంభర’ పై చిరు లీక్స్.. ఆ పాట గురించి చెప్పేశారుగా..! పూనకాలే ఇక?
సజ్జనార్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో నానికి ఎదురుపడగా ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. నాని, సజ్జనార్ ఇద్దరూ మాట్లాడుకున్న వీడియోలు, ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల నాని ముంబై వెళ్తూ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో సమంతని కూడా ఇలాగే కలిశారు.
TGSRTC MD Shri #Sajjanar met the Natural Star @NameIsNani, at the Hyderabad airport and had friendly chat. ✨ ❤️#SaripodhaaSanivaaram #SuryasSaturday @DVVMovies @tgsrtcmdoffice pic.twitter.com/RUz2oKxV7D
— ??????????? (@UrsVamsiShekar) August 27, 2024