Raj Tarun : ‘పెళ్ళైంది కాని నో కహాని’ పోస్టర్ రిలీజ్.. రాజ్ తరుణ్ చేతుల మీదుగా..

ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ని హీరో రాజ్ తరుణ్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. (Raj Tarun)

  • Published on- June 2, 2026 / 04:23 PM IST

Raj Tarun

Raj Tarun : శ్రీహరి, స్మిత జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘పెళ్ళైంది కాని నో కహాని’. మై3 సినిమాస్ బ్యానర్ పై ఏడుకొండలు తాడిశెట్టి దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈ సినిమా. త్వరలో థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ని హీరో రాజ్ తరుణ్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు.

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దర్శక నిర్మాతలు నాకు పరిచయం ఉన్నవారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ సినిమా కూడా హిట్ అవ్వాలి అన్నారు. అనంతరం హీరో శ్రీహరి మాట్లాడుతూ.. మా సినిమా పోస్టర్ లాంఛ్ చేసేందుకు హీరో రాజ్ తరుణ్, ఐఎఫ్ఎక్స్ అధినేత పద్మనాభరెడ్డి గారికి కృతజ్ఞతలు. ‘పెళ్ళైంది కాని నో కహాని’ సినిమా బాగా వచ్చింది. నెలన్నరలో ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమా ఫుల్ ఫన్ ఎంటర్టైన్ చేస్తుంది అని అన్నారు.

Also Read : Buchibabu Sana : ఎన్టీఆర్ పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి చేస్తా.. బుచ్చిబాబు కామెంట్స్ వైరల్..

డైరెక్టర్ ఏడుకొండలు తాడిశెట్టి మాట్లాడుతూ.. పెళ్ళైంది కాని నో కహాని సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండు మూడు రోజుల్లో సెన్సార్ కు సినిమా వెళ్తోంది. వచ్చే నెలలో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం అన్నారు.