Raj Tharun – Lavanya : రాజ్ తరుణ్ లవర్ లావణ్య హై డ్రామా.. అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ..

తాజాగా శుక్రవారం అర్ధరాత్రి లావణ్య హైడ్రామా చేసింది. తన అడ్వాకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకరతో నిన్న అర్ధరాత్రి నేను చనిపోతున్నాను అంటూ చాటింగ్ చేసింది.

Raj Tharun Lavanya High Drama at MidNight with Police News goes Viral

Raj Tharun – Lavanya : గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. హీరో రాజ్ తరుణ్ తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని, అబార్షన్ చేయించాడని, ఇప్పుడు వేరే హీరోయిన్ ని పెళ్లి చేసుకోడానికి రెడీ అయ్యాడని లావణ్య అనే యువతి కేసు పెట్టింది. మీడియా ముందుకు కూడా వచ్చి లావణ్య రాజ్ తరుణ్ పై, హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై ఆరోపణలు చేసింది. మాల్వి కూడా లావణ్యపై కేసు పెట్టింది. రాజ్ తరుణ్ కూడా మాకు బ్రేకప్ అయ్యాక ఇప్పుడొచ్చి ఇలా ఆరోపణలు చేస్తుంది అని తెలిపాడు.

అయితే ఈ కేసులో రోజుకొక ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే రాజా తరుణ్, మాల్వి మల్హోత్రాలపై కేసు కూడా నమోదు చేశారు. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి లావణ్య హైడ్రామా చేసింది. తన అడ్వాకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకరతో నిన్న అర్ధరాత్రి నేను చనిపోతున్నాను అంటూ చాటింగ్ చేసింది.

Also Read : Raj Tharun : రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్.. రాజ్ తరుణ్ తో పాటు ఇంకో ఇద్దరిపై కేసు నమోదు..

లావణ్య.. ఈ లోకంలో నా పయనం పూర్తి చేసాను. అందుకే ఈ లోకం నుండి వెళ్లిపొతున్నాను. నా గురించి తెలిసిన మనుషులే నన్ను తప్పు బట్టారు. నేను ఎవరో తెలియని వాళ్లు నా వెంట నిలిచారు. ఈ లోకం ఒక మాయ. ఈ మాయా ప్రపంచంలో నేను బ్రతకడం నాకు ఇష్టం లేదు. రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేసారు. మైండ్ గేమింగ్, గాసిప్స్ తో విసిగిపోయాను. మస్తాన్ కేసులో నేను కీలు బొమ్మను అయ్యాను. ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరిగింది. నా భర్త నాకు కావాలని మాల్వి మలోత్రాను బ్రతిమిలాడాను కానీ తను వినిపించుకోలేదు. నా చావుకు కారణం రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులు, మాల్వీ మలోత్రా. రాజ్ తరుణ్ మాల్వీ మలోత్రా మోజులో పడి మారి పోయాడు. నా మరణాన్ని కోరుకుంటున్నాడు అని చాట్ చేసినట్టు తెలుస్తుంది.

అలాగే నేను ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నానంటూ ఎమర్జెన్సీ నంబర్ డయల్ 112కు ఫోన్ చేసి చెప్పింది. దీంతో నార్సింగ్ పోలీసులు హుటాహుటిన లావణ్య నివాసానికి చేరుకొని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి భరోసా కల్పించారు.

ట్రెండింగ్ వార్తలు