Raj Tharun Malvi Malhotra Tiragabadara Saami Movie Postponed due to Lavanya Issue
Raj Tharun Movie : గత కొన్ని రోజులుగా లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ మోసం చేసాడని పలు ఆరోపణలు చేస్తూ రాజ్ తరుణ్ పై, హీరోయిన్ మాల్వి మల్హోత్రా పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడమే కాక మీడియా ముందుకొచ్చి ఆ ఇద్దరిపై అనేక ఆరోపణలు చేస్తుంది. అయితే ఈ గొడవ మొదట్లో రాజ్ తరుణ్ స్పందించినా ఆ తర్వాత లావణ్య చేసే ఆరోపణలకు స్పందించలేదు. మరో వైపు హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాత్రం తప్పుడు ఆరోపణలు చేస్తుంది అంటూ లావణ్య పై కేసు పెట్టింది.
అయితే ఈ కేసులు, గొడవల నేపథ్యంలో రాజ్ తరుణ్ – మాల్వి మల్హోత్రా కలిసి నటించిన సినిమా వాయిదా పడింది. రాజ్ తరుణ్ – మాల్వి మల్హోత్రా కలిసి నటించిన ‘తిరగబడర సామీ’ సినిమా జులై 19న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఈ కేసుల దెబ్బకి సినిమాని వాయిదా వేశారు. ఈ సమయంలో రాజ్ తరుణ్ – మాల్వి ప్రమోషన్స్ కి బయటకి వస్తే మొత్తం దీని గురించే అడుగుతారని, ఇప్పుడు రాజ్ తరుణ్ ఇమేజ్ నెగిటివ్ గా ప్రమోట్ అవుతుందని, ఇప్పుడు సినిమా రిలీజ్ చేస్తే కష్టమే అని ఆలోచించి తిరగబడర సామీ సినిమాని ఆగస్టు 2కు వాయిదా వేశారు.
Also Read : Raj Tharun : రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్.. రాజ్ తరుణ్ తో పాటు ఇంకో ఇద్దరిపై కేసు నమోదు..
మరి ఆగస్టు 2 వరకు అయినా రాజ్ తరుణ్ కేసు చల్లారుతుందా? లేక ప్రమోషన్స్ లేకుండానే సినిమాని రిలీజ్ చేస్తారా చూడాలి. మొత్తానికి రాజ్ తరుణ్ ఇష్యూ అతని సినిమాలపై, అతని కెరీర్ పై గట్టిగానే ఎఫెక్ట్ చూపించనుంది.
He is ready to make a MASS IMPACT!?#TiragabadaraSaami Grand release worldwide on August 2nd, 2024 ??#TiragabadaraSaamionAug2nd
A #ASRavikumarChowdhary Film
⭐ing @ItsRajTarun @MalviMalhotra @memannara@shivamalkapuram #JB #SurakshEntertainments @adityamusic pic.twitter.com/b9njvudDcF— ??????????? (@UrsVamsiShekar) July 11, 2024