Modern Masters : రాజమౌళి మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీని తెరకెక్కించింది ఎవరో తెలుసా?
రాజమౌళి గురించి తీసిన మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ లో చూసేయండి.
- Saketh U
- Published On : August 6, 2024 / 02:21 PM IST
Rajamouli Documentary Modern Masters Produced by Bollywood Applause Entertainment and Film Companion Studios
Modern Masters Rajamouli : రాజమౌళిపై ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ అవుతుంది. అయితే రాజమౌళిపై ఈ డాక్యుమెంటరీని నిర్మించింది బాలీవుడ్ నిర్మాణ సంస్థలు కావడం విశేషం. బాలీవుడ్ కి చెందిన అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిలిం కంపానియన్ స్టూడియోస్ నిర్మాణ సంస్థలు కలిసి రాజమౌళి డాక్యుమెంటరీ మోడ్రన్ మాస్టర్స్ ని తెరకెక్కించారు. ఈ మోడ్రన్ మాస్టర్ డాక్యుమెంటరీని రాఘవ్ కన్నా డైరెక్ట్ చేసాడు.
బాలీవుడ్ లో పలు సినిమాలు, చాలా టీవీ షోలు నిర్మించిన సంస్థ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్. ఇది ఆదిత్య బిర్లా గ్రూప్ కి చెందిన సంస్థ కావడం విశేషం. మన తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి పై డాక్యుమెంటరీని బాలీవుడ్ కి చెందిన అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిలిం కంపానియన్ సంస్థలు నిర్మించడం గమనార్హం.
Also Read : Allu Sneha – Arha : తిరుమలకు కాలి నడకన అల్లు అర్జున్ భార్య, కూతురు.. అర్హ పాప ఎంత క్యూట్ గా ఉందో..
ఇక ఈ మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీలో రాజమౌళి చిన్నప్పటి విశేషాలు, ప్రేమ, పెళ్లి గురించి, రాజమౌళి కెరీర్ ఆరంభం, ఆ తర్వాత రాజమౌళి సినిమాల గురించి చర్చించారు. రాజమౌళి గురించే అతను మాత్రమే చెప్పడం కాకుండా రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ కీరవాణి, రమా రాజమౌళి, కార్తికేయ, కాంచి, విజయేంద్రప్రసాద్ తో పాటు ఎన్టీఆర్, ప్రభాస్, రానా, రామ్ చరణ్, హాలీవుడ్ డైరెక్టర్స్ జేమ్స్ కామెరూన్, జో రసో.. ఇలా అనేకమంది రాజమౌళి గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. మీరు ఇంకా చూడకపోతే రాజమౌళి గురించి తీసిన మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ లో చూసేయండి.
