Varanasi
Varanasi : రాజమౌళి మహేష్ బాబు వారణాసి సినిమా శరవేగంగా తెరకెక్కుతుంది. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇటీవల డేట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ తో వారణాసి సినిమా కూడా రెండు పార్టులు ఉంటుందని రూమర్స్ వచ్చాయి.(Varanasi)
రాజమౌళి బాహుబలి సినిమాతో రెండు పార్టులు అంటూ మొదలుపెట్టాడు. ఆ తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా చాలా సినిమాలు రెండు పార్టులు ప్రకటిస్తున్నాయి. దీంతో ప్రేక్షకులకు సినిమా రెండు పార్టులు అనేసరికి ఆసక్తి తగ్గుతుంది. ఆ రెండో పార్ట్ ఎప్పుడొస్తుందో, అసలు వస్తుందో రాదో అని సందేహాలు కూడా వస్తున్నాయి. వారణాసి సినిమాకు కూడా రెండు పార్టులు అని రూమర్స్ రావడంతో సెకండ్ పార్ట్ కోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో అని ఫ్యాన్స్, ప్రేక్షకులు భావించారు.
Also Read : Mahesh Babu : రాజమౌళికి మెసేజ్ చేసిన మహేష్.. ఆయన ఇచ్చిన రిప్లై చూసి షాక్.. ఇద్దరిమధ్య ఏం జరిగిందో తెలుసా?
అయితే వారణాసి ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి హాలీవుడ్ లో ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో దీనిపై రాజమౌళి మాట్లాడుతూ.. మొదట వారణాసి సినిమాకు కూడా రెండు పార్టులు అనుకున్నాం కానీ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నాం. వారణాసి సినిమా నిడివి దాదాపు మూడు గంటలు ఉంటుంది అని తెలిపారు. దీంతో వారణాసికి పార్ట్ 2 లేదని రాజమౌళే క్లారిటీ ఇవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
Also Read : Mahesh Babu : హాలీవుడ్ ఇంటర్వ్యూలో ‘పోకిరి’ గురించి మాట్లాడిన మహేష్.. ఏం చెప్పాడో తెలుసా?