Varanasi : ఏంటి వారణాసి విషయంలో అది నిజంగానే జరుగుతుందా? అనుమానమే..

టైటిల్ రిలీజ్ నుంచే వారణాసి సినిమాని హాలీవుడ్ లో తెగ ప్రమోట్ చేస్తున్నాడు రాజమౌళి. (Varanasi)

  • Published on- July 1, 2026 / 10:45 AM IST

Varanasi

Varanasi : రాజమౌళి వారణాసి సినిమా రిలీజ్ 2027 ఏప్రిల్ లో అని చెప్పినా అది వచ్చేవరకు సందేహమే. ఇంకా ఆ సినిమా 80 రోజుల షూటింగ్ మిగిలివుందని, అక్టోబర్ వరకు షూటింగ్ అయిపోతుందని రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్నేషనల్ వేదికపై తెలిపారు. RRR తో ఇంటర్నేషనల్ ఫేమ్ తెచ్చుకున్న రాజమౌళి వారణాసి సినిమాని హాలీవుడ్ టార్గెట్ గానే తెరకెక్కిస్తున్నాడు.

టైటిల్ రిలీజ్ నుంచే వారణాసి సినిమాని హాలీవుడ్ లో తెగ ప్రమోట్ చేస్తున్నాడు రాజమౌళి. తాజాగా ఈ వారణాసి గురించి మరో అప్డేట్ వినిపిస్తుంది. ప్రపంచమంతా ఈ సినిమాని రిలీజ్ చేయాలని వారణాసిని దాదాపు 200 భాషల్లో రిలీజ్ చేస్తారని ఓ టాక్ వినిపిస్తుంది. గతంలో ఫ్రోజెన్, ది లయన్ కింగ్, ఫ్రోజెన్ 2, అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమాలు మాత్రమే హైయెస్ట్ 50 భాషల్లోకి రిలీజ్ అయ్యాయి. థియేటర్, ఓటీటీ కలిపి ఈ లెక్క. మరి కొన్ని సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలు 20 నుంచి 40 భాషల్లో రిలీజ్ అయ్యాయి.

Also Read : Trivikram : ఆ సినిమా విషయంలో తమన్ కి వెన్నుపోటు పొడిచిన త్రివిక్రమ్.. సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్..

రాజమౌళి RRR సినిమా థియేటర్, ఓటీటీ కలుపుకొని దాదాపు పది భాషల వరకు డబ్ అయింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో వేరే దేశ భాషల్లో డబ్ అవ్వడం వల్లే ఈ సినిమాకు అంత రీచ్ వచ్చింది. అందుకే వారణాసి సినిమాను కూడా వేరే భాష ప్రేక్షకులకు దగ్గర చేయాలని, హాలీవుడ్ కి సౌండ్ గట్టిగా వినిపించాలని, తెలుగు, ఇండియన్ సినిమాలకు గట్టి మార్కెట్ ఉన్న అమెరికా, జపాన్, థాయిలాండ్, మలేషియా, సౌత్ ఆఫ్రికా, దుబాయ్, ఇంగ్లాండ్.. లాంటి పలు దేశాల్లో అక్కడి స్థానిక భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

ఆ తర్వాత ఓటీటీలో మరిన్ని దేశాల భాషలతో డబ్ చేసే ఆలోచనలో ఉన్నారట. 200 భాషలు అని చెప్పడానికి ఈజీగానే ఉన్నా తక్కువ సమయంలో చేయడానికి చాలా కష్టం. అందుకే అన్ని కాకపోయినా థియేటర్, ఓటీటీ కలుపుకొని హాలీవుడ్ సినిమాలలాగే కనీసం 50 భాషల్లో అయినా రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అలా అయినా వారణాసి సరికొత్త రికార్డ్ సృష్టించినట్టే. పైగా అన్ని భాషల్లో, అన్ని దేశాల్లో రిలీజ్ చేస్తే కలెక్షన్స్ కూడా భారీగా వచ్చే అవకాశం ఉన్నట్టే.