Trivikram Srinivas Trolls : ఆ సినిమా విషయంలో తమన్ కి వెన్నుపోటు పొడిచిన త్రివిక్రమ్.. సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్..
త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మైథలాజికల్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ ని ప్రకటించారు. (Trivikram Srinivas)
Trolls Trivikram Srinivas NTR Music Director Anirudh over Thaman
Trivikram Srinivas: త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో ఆదర్శకుటుంబం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయ్యాక ఎన్టీఆర్ తో భారీ మైథలాజికల్ సినిమా చేయబోతున్నట్టు ఇటీవలే ప్రకటించారు. కుమారస్వామి కథతో ఈ సినిమా ఉండబోతుంది. అయితే ఈ సినిమా విషయంలో పలువురు నెటిజన్లు తమన్ కి సపోర్ట్ గా మీమ్స్, పోస్టులు వేస్తున్నారు.
త్రివిక్రమ్ – ఎన్టీఆర్ మైథలాజికల్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ ని ప్రకటించారు. ఈ సినిమా అప్డేట్ నిర్మాత నాగవంశీ ఇచ్చినప్పుడు దాన్ని షేర్ చేస్తూ ఎమోజిస్ తో సినిమాపై హైప్ పెంచాడు తమన్. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో కూడా తమన్ ఈ సినిమాకు తనే సంగీత దర్శకుడిగా ఉండబోతున్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పాడు.
Also Read : లారెన్స్ వర్సెస్ త్రిష.. విజయ్ ఎవరి పక్షాన ఉంటాడు?
కానీ ఇప్పుడు అనిరీద్ ని ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట్ గా ప్రకటించడంతో విమర్శలు వస్తున్నాయి. ఆల్రెడీ త్రివిక్రమ్ తో తమన్ గుంటూరు కారం, అల వైకుంఠపురంలో, అరవింద సమేత వీరరాఘవ సినిమాలకు పనిచేసి మంచి మ్యూజిక్, హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఇప్పుడు నాలుగోసారి ఆదర్శ కుటుంబం సినిమాకు పనిచేస్తున్నారు. ఇంత హిట్ కాంబోని వదిలేసి త్రివిక్రమ్ ఎందుకు అనిరుధ్ ని తీసుకున్నాడు అని ప్రశ్నిస్తున్నారు.
త్రివిక్రమ్ గతంలో అనిరుధ్ తో కలిసి పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాకు పనిచేసారు. ఆ సినిమాలో ఒక్క సాంగ్ తప్ప మిగిలిన సాంగ్స్, మ్యూజిక్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. సినిమా కూడా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. మంచి హిట్స్ ఇచ్చిన తమన్ ని వదిలేసి అనిరుధ్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో త్రివిక్రమ్ కే తెలియాలి. దీంతో పాపం తమన్ అంటూ త్రివిక్రమ్ పై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో అరవింద వీర రాఘవ సినిమాకు ముందు అనిరుధ్ ని ప్రకటించి తర్వాత తమన్ ని తీసుకున్నారు. ఆ సినిమాకు తమన్ అదిరిపోయే సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఒకవేళ దాని రీప్లేస్మెంట్ కోసం ఇప్పుడు తమన్ సినిమాని అనిరుధ్ కి ఇచ్చారేమో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
View this post on Instagram
Also Read : ‘లెనిన్’ రొటీన్ స్టోరీనా? కథనం, అఖిల్ నటనతోనే మెప్పిస్తారా?
View this post on Instagram
