Rajamouli spoke about his dream project Mahabharatham
Rajamouli : మన తెలుగు(Telugu) సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఆస్కార్(Oscar) సాధించాడు రాజమౌళి. RRR సినిమాతో రాజమౌళి గ్లోబల్ డైరెక్టర్ అయ్యాడు. దీంతో అందరి చూపు రాజమౌళి నెక్స్ట్ తీసే సినిమాలపైనే ఉంది. రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో(Mahesh Babu) యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా తీయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మహేష్ -త్రివిక్రమ్ సినిమా అయ్యాక ఈ సినిమా షూట్ మొదలవ్వబోతుంది.
ఇక రాజమౌళి డ్రీం ప్రాజెక్టు మహాభారతం అని, దాన్ని ఎప్పటికైనా సినిమాగా తీయాలని రాజమౌళి గతంలో చాలా సార్లు చెప్పాడు. దీంతో తెలుగు ప్రేక్షకులతో పాటు, ఇండియన్ ఆడియన్స్ కూడా రాజమౌళి మహాభారతం చేస్తే చూడాలని ఎదురుచూస్తున్నారు. తాజాగా రాజమౌళి మహాభారతం ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. రాజమౌళి ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనగా ఓ మీడియా ప్రతినిధి.. గతంలో మీరు మహాభారతం సినిమా తీస్తా అన్నారు. ఆ కథ టీవీలో సీరియల్ రూపంలో దాదాపు 200 ఎపిసోడ్స్ కి పైగా టెలికాస్ట్ అయింది. మీరైతే ఎన్ని భాగాలుగా తీస్తారు అని అడిగారు.
RRR : జపాన్‌లో 200 రోజులు పూర్తి.. JPY 2 బిలియన్ల కలెక్షన్స్!
దీనికి రాజమౌళి సమాధానమిస్తూ.. అది నాకు కూడా తెలియదు. ఇది చాలా కష్టమైనా ప్రశ్న. ఒకవేళ మహాభారతం తీయాలనుకుంటే ముందు భారతదేశంలో అందుబాటులో ఉన్న అన్ని మహాభారత వర్షన్లు చదవాలి. అందుకు సంవత్సరం పైనే పడుతుంది. అది చాలా పెద్ద ప్రాజెక్టు. ఒకవేళ మహాభారతం తీస్తే దాదాపు 10 భాగాలుగా తీయొచ్చు అనుకుంటున్నాను. కానీ కచ్చితమైన నంబర్ చెప్పలేను అని అన్నారు. దీంతో రాజమౌళి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాజమౌళి ఒక్క సినిమా తీయడానికే మూడు నుంచి నాలుగు ఏళ్ళు పడుతుంది. ఇక మహాభారతం పది భాగాలూ అంటే ఎప్పటికి అవుతుందో, అసలు రాజమౌళి డ్రీం ప్రాజెక్టు మహాభారతం తెరెక్కుతుందా చూడాలి మరి.