Rajamouli – Yash : బళ్లారి ఆలయంలో రాజమౌళి, యశ్.. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో..
బళ్లారి ఆలయంలో దేవుడి సేవలో రాజమౌళి, యశ్. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని..
- gum 95921
- Updated on- February 29, 2024 / 03:02 PM IST
Rajamouli Yash at Sree Amrutheswara Temple in Bellary video gone viral
Rajamouli – Yash : ఇండియన్ సినిమా స్థాయిని తమ సినిమాలతో పెంచేసిన దర్శకుడు రాజమౌళి, హీరో యశ్.. బళ్లారిలోని ఆలయంలో సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాజమౌళి తెలుగు వారు అయ్యినప్పటికీ.. ఆయన పుట్టింది కర్ణాటకలోని ఒక చిన్న గ్రామంలో అని అందరికి తెలిసిందే. చిన్నతనంలో అక్కడే ఉన్న రాజమౌళి.. ఆ ఊరు (హైర్ కొట్నేకల్) పై మమకారం ఉంది.
దీంతో అప్పుడప్పుడు ఆ ప్రాంతాల్లో సందడి చేస్తుంటారు. ఆ మధ్య కర్ణాటక ఎలక్షన్ సమయంలో.. తన పుట్టిన ఊరులో ఓటు పై అవగాహన కల్పించేలా కాంపెయిన్ చేశారు. తాజాగా ఈ దర్శకుడు కర్ణాటకలోని బళ్లారిలో కుటుంబంతో కలిసి ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు. బళ్లారిలోని శ్రీ అమృతేశ్వరా ఆలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమౌళి కుటుంబం పాల్గొన్నారు.
Also read : Sree Vishnu : లీప్ ఇయర్ ఫిబ్రవరి 29 పుట్టిన ఏకైక హీరో.. వెరీ స్పెషల్ బర్త్ డే సెలెబ్రేషన్స్..
ఇక ఈ దర్శకుడితో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన హీరో యశ్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవుడి సేవలో ఇండియన్ టాప్ డైరెక్టర్ అండ్ హీరో పాల్గొని అందర్నీ ఆకట్టుకున్నారు. కాగా ఆలయానికి వీరిద్దరూ రావడంతో.. భారీగా అభిమానులు తరలి వచ్చారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. వాటి వైపు మీరు ఓ లుక్ వేసేయండి.
కాగా యశ్ ప్రస్తుతం ‘టాక్సిక్’ అనే సినిమా చేస్తున్నారు. మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం 2025లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక రాజమౌళి ఏమో మహేష్ తో SSMB29 తెరకెక్కించబోతున్నారు. ఈ ఏడాది మేలో ఈ సినిమా పట్టాలు ఎక్కనుందని టాక్ వినిపిస్తుంది.
