మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా)లో విభేదాలు రచ్చకెక్కాయి. మా ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్ పదవికి హీరో రాజశేఖర్ రాజీనామా చేశారు.
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా)లో విభేదాలు రచ్చకెక్కాయి. మా ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్ పదవికి హీరో రాజశేఖర్ రాజీనామా చేశారు. రాజశేఖర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు డిసిప్లీనరీ కమిటీ నుంచి షోకాజ్ నోటీసులు వెళ్లడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. గురువారం (జనవరి 2, 2020) జరిగిన మా డైరీ ఆవిష్కరణలో చిరంజీవి ప్రసంగానికి రాజశేఖర్ అడ్డుపడ్డారు. చిరంజీవి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. మాలో చాలా గొడవలు ఉన్నాయని, ప్రొటో కాల్ పాటించడం లేదని రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోసియేషన్ లో ఉన్న నిప్పును కప్పేస్తే పొగ రాకుండా ఉండదన్నారు. రాజశేఖర్ ప్రసంగాన్ని అడ్డుకోబోయిన మోహన్ బాబుపై ఆయన విమర్శలు చేశారు. అనంతరం రాజశేఖర్ సభ నుంచి బయటికి వెళ్లిపోయారు.
రాజశేఖర్ తీరుపై చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీప్లాన్డ్ గా వచ్చారని..కావాలనే కార్యక్రమాన్ని రసాభాస చేశారని…క్రమ శిక్షణ కమిటీ ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఆ మేరకు క్రమ శిక్షణ కమిటీ రాజశేఖర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మనస్థాపం చెందిన రాజశేఖర్ మా వైఎస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు.
మాలో అంతర్గతంగా విభేదాలున్నట్లు అందరికీ తెలిసిన విషయమే. అయితే విభేదాలు తారాస్థాయి చేరి ఇవాళ మా డైరీ ఆవిష్కరణ సభలో రచ్చకెక్కాయి. డిసిప్లీనరీ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నిర్ణయం మేరకు రాజశేఖర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయనకు షోకాజ్ నోటీసులు వెళ్లడంతో రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేశారు.
మా అసోసియేషన్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం బేదాభిప్రాయాలకు వేదికైంది. మా అసోసియేషన్ లో వచ్చిన చిన్న చిన్న విబేధాలపై చిరంజీవి, మోహన్ బాబు మాట్లాడగా రాజశేఖర్ తప్పుబట్టారు. అంతేకాకుండా కార్యక్రమం మధ్యలో నుంచే వెళ్లిపోయాడు. కొత్త సంవత్సరం సందర్భంగా మాలో విబేధాలు బయటపడ్డాయి.
హైదరాబాద్ లోని ఓ హోటల్ లో మా ఆధ్వర్యంలో 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులగా చిరంజీవి, మోహన్ బాబుతోపాటు కృష్ణంరాజు, రాజ్యసభ్యులు టి.సుబ్బిరామిరెడ్డి, మాజీ ఎంపీ మురళీ మోహన్ హాజరయ్యారు. మాలో ఉన్న చిన్న చిన్న వివాదాలకు తెరదించాలని చిరంజీవి కోరారు. అందరం కలిసి ఏకాభిప్రాయంతో అసోసియేషన్ ను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. రెండు ప్రభుత్వాల చేయూతతో మాను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని అన్నారు. ఏదైనా చెడుఉంటే చెవిలో మాత్రమే చెప్పాలని సూచించారు.
ఇదే సమయంలో చిరంజీవి ప్రసంగానికి రాజశేఖర్ అడ్డుపడ్డారు. మాలో చాలా గొడవలు ఉన్నాయని..ప్రొటో పాటించడం లేదని రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోసియేషన్ లో ఉన్న నిప్పును కప్పేస్తే పొగ రాకుండా ఉండదన్నారు. రాజశేఖర్ ప్రసంగాన్ని అడ్డుకోబోయిన మోహన్ బాబుపై ఆయన విమర్శలు చేశారు. రాజశేఖర్ ప్రవర్తనపై చిరంజీవి, మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజశేఖర్ తీరుపై చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వ్యక్తుల గురించి మాట్లాడలేదని..సమస్యలను పరిష్కరించుకుందామని మాత్రమే మాట్లాడానని అన్నారు. ప్రీప్లాన్డ్ గా వచ్చారని..కావాలనే కార్యక్రమాన్ని రసాభాస చేశారని…క్రమ శిక్షణ కమిటీ ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రాజశేఖర్ పై మోహన్ బాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే తల్లి బిడ్డల్లా ఉండాలన్నారు. ఎవరు ఎవరికి సవాలు చేసుకోకూడదన్నారు. మనస్పర్ధలు ఉంటే కూర్చుని మాట్లాడుకుందామన్నారు. సవాళ్లకు వస్తే దేనికైనా తాను భయపడనని అన్నారు.
రాజశేఖర్ విషయంపై ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ స్పందించారు. రాజశేఖర్ ది చిన్నపిల్లాడి మనస్తత్వం అన్నారు. అసోసియేషన్ కు సంబంధించి సమస్యలను ఇప్పటికే పెద్దలకు వివరించామని తెలిపారు. మా అసోసియేషన్ ప్రపంచంలో పెద్ద అసొసియేషన్ గా ఎదగాలని ఆకాంక్షించారు.