D_O Prasad Rao Kanabadutaledhu
D/O Prasad Rao : రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ పై కె.వి. శ్రీరామ్ నిర్మాణంలో కృష్ణ పోలూరు దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ వెబ్ సిరీస్ నేడు ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.
సూళ్లూరుపేటలో ఉండే ప్రసాద్ రావు(రాజీవ్ కనకాల)కు కూతురు స్వాతి(వసంతిక) అంటే చాలా ప్రేమ. చిన్నప్పట్నుంచి ఎక్కడికి ఒంటరిగా పంపలేదు. చదువు అయిపోయి హైదరాబాద్ లో జాబ్ వచ్చిందని స్వాతి వెళ్తానంటే మొదట ఒప్పుకోకపోయినా అందరూ చెప్పేసరికి ఒప్పుకుంటాడు. హైదరాబాద్ కి వచ్చి స్వాతిని ఆఫీస్ లో జాయిన్ చేసి, ఓ హాస్టల్ లో చేర్చి ఊరెళ్ళిపోతాడు ప్రసాద్ రావు.
ఓ నెల రోజుల తర్వాత రోజూ ఫోన్ లో మాట్లాడే కూతురు ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదని కంగారుగా రాత్రి బయలుదేరి హైదరాబాద్ కి వస్తాడు. అప్పటికే స్వాతి కనిపించట్లేదని హాస్టల్ లో మిస్ అయిందని మీడియాలో వస్తుంది. పోలీసాఫీసర్ రెబెకా జోసెఫ్(ఉదయభాను)చేతికి ఈ కేసు వస్తుంది. అసలు స్వాతి ఏమైంది? రెబెకా ఈ కేసుని ఎలా డీల్ చేసింది? ఎంతో ప్రేమగా పెంచుకున్న కూతురు స్వాతి కోసం తండ్రి పడే తాపత్రాయం ఏంటి? అసలు స్వాతికి ఏమైంది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే..
Also Read : Ustaad Bhagat Singh : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లో నటించిన యాంకర్.. ఎవరో తెలుసా?
అమ్మాయి మిస్సింగ్ నేపథ్యంలో చాలా సినిమాలు, సిరీస్ లు వచ్చాయి. ఈ సిరీస్ కూడా అదే కోవలోకి చెందింది. కొన్ని సిరీస్ లలో మొదట ఒక కథకు సంబంధించి ఓ సీన్ చూపించి అసలు కథలోకి తీసుకెళ్తారు. ఇందులో కూడా అలాగే చూపించడంతో అసలు ఫ్లాష్ బ్యాక్ లో చూపించే ఈ కథేంటి? ఇది అసలు కథకు ఎలా లింక్ అవుతుంది అనే ఆసక్తి అయితే నెలకొంది. వెబ్ సిరీస్ కాబట్టి కొన్ని చోట్ల ల్యాగ్ ఉంది. స్వాతి మిస్ అయిన తర్వాత నుంచి పోలీసులు ఎలా విచారణ చేసారు ఈ కేసుని అని బాగానే రాసుకున్నారు.
మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ లో ఇంతేనా అనిపిస్తుంది కానీ లాస్ట్ ఎపిసోడ్ లో అసలు ట్విస్టులు రివీల్ చేసి, మొదట్నుంచి చూపించిన ఓ కథకి ఈ కథకి కనెక్షన్ చూపించడంతో షాక్ అవుతాం. లాస్ట్ ఎపిసోడ్ ట్విస్టులు రివీల్ చేయడం మాత్రం థ్రిల్లింగ్ గా సాగుతుంది. ఇలాంటి అమ్మాయి మిస్సింగ్ కథలకు రెగ్యులర్ ముగింపు కాకుండా ఓ కొత్త కారణం చూపించి ముగింపు ఇవ్వడం బాగుంది.
అలాగే తండ్రి ఎమోషన్ ని బాగా చూపించారు. చివర్లో పేరెంట్స్ – పిల్లల మధ్య ఎమోషన్ గురించి ఓ మెసేజ్ ఇచ్చారు. విలన్ ఎవరు అనేది వాళ్ళు రివీల్ చేసేంతవరకు ఊహించలేము. అదే ఈ సిరీస్ కు ప్లస్ అవుతుంది. అక్కడక్కడా కాస్త ల్యాగ్ అనిపించినా కొత్త క్లైమాక్స్, ట్విస్టులతో ఈ సిరీస్ బాగానే మెప్పిస్తుంది. సస్పెన్స్ సిరీస్ లు చూసేవాళ్ళు ఈ సిరీస్ చూసేయొచ్చు.
తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల మంచి ఎమోషన్ పండించాడు. వసంతిక కూతురి పాత్రలో చక్కగా నటించింది. ఉదయభాను చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో బాగా నటించింది. గాయత్రీ భార్గవికి మంచి పాత్ర పడింది. జెమిని సురేష్, బిందు చంద్రమౌళి, రాజ్ సత్య.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also See : Priyanka Chopra : ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’ సినిమా వర్కింగ్ స్టిల్స్..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. అక్కర్లేని సన్నివేశాల్లో కూడా ఏదో ఉంది అన్నట్టు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హెవీగా ఇచ్చారు. సూళ్లూరుపేట యాసని ఆర్టిస్టులు చెప్పడానికి బాగానే కష్టపడ్డారు. ఎడిటింగ్ కూడా బాగుంది. కథ రొటీన్ అయినా కొత్త క్లైమాక్స్, మంచి స్క్రీన్ ప్లేతో బాగా రాసుకొని తెరకెక్కించారు. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్ తండ్రి ఎమోషన్ తో కూతురు మిస్సింగ్ తో సాగిన సస్పెన్స్ వెబ్ సిరీస్.
గమనిక : ఈ సిరీస్ రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.