Rajinikanth : ఇండస్ట్రీ హిట్ ‘బాషా’ సినిమాకు సీక్వెల్ వద్దని.. ఇప్పుడు ‘జైలర్’కి ఎందుకు..? స్పందించిన రజినీకాంత్..

రజినీకాంత్ కెరీర్లో ఇండస్ట్రీ హిట్ లాంటి బాషా సినిమాకు సీక్వెల్ తీద్దామని దర్శక నిర్మాతలు కూడా ఆయన్ని సంప్రదించినా వద్దన్నారు. (Rajinikanth)

  • Published on- October 11, 2026 / 03:34 PM IST

Rajinikanth

Rajinikanth : రజినీకాంత్ జైలర్ 2 సినిమాతో అక్టోబర్ 15న రాబోతున్నారు. 2023లో వచ్చిన జైలర్ సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది ఈ సినిమా. ఈ జైలర్ 2 పై కూడా తమిళ్, తెలుగులో భారీగానే అంచనాలు ఉన్నాయి. అయితే రజినీకాంత్ కెరీర్ లో చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అందులో బాషా, నరసింహ లాంటి సినిమాలకు సీక్వెల్స్ కూడా వస్తాయని కొన్నిసార్లు వార్తలు వచ్చాయి. ఒక్క రోబో సినిమాకు మాత్రం సీక్వెల్ అని తీసినా కాస్త కొత్త కథే చేసారు.

రజినీకాంత్ కెరీర్లో ఇండస్ట్రీ హిట్ లాంటి బాషా సినిమాకు సీక్వెల్ తీద్దామని దర్శక నిర్మాతలు కూడా ఆయన్ని సంప్రదించినా వద్దన్నారు. కానీ జైలర్ సినిమాకు సీక్వెల్ తీయమని రజినీకాంత్ స్వయంగా దర్శకుడు నెల్సన్ కి కాల్ చేశారట. తాజాగా ఈ సినిమా తమిళ మీడియా ప్రమోషన్స్ లో రజినీకాంత్ మాట్లాడుతూ దీనిపై స్పందించాడు.

Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ బైక్ రేసింగ్.. మోకాళ్ళు కొట్టుకుపోయి..

రజినీకాంత్ మాట్లాడుతూ.. నాకు చాలా సినిమాలకు సీక్వెల్ చేద్దామని ఆఫర్స్ వచ్చాయి. నాకు సీక్వెల్స్ చేయడం నచ్చదు. ఫస్ట్ పార్ట్ ని తీసుకొని దానికి కొద్దిగా కొనసాగింపు రాసుకొని కొన్ని సీన్స్ తో మరో సినిమాగా తీస్తారని నాకు అనిపిస్తుంది. అందుకే నేను సీక్వెల్స్ చేయను. కానీ జైలర్ 2 సినిమాకు సీక్వెల్ బాగా కుదిరింది. తన మనుషులు జైలర్ ను వెంబడిస్తారని పార్ట్-1లో వర్మ చెప్తాడు. అతడికి ఇంటర్నేషనల్ నెట్ వర్క్ ఉందని అంటాడు. జైలర్ దగ్గర వేల కోట్ల రూపాయల విలువైన కంటైనర్లు ఉన్నాయి. ఇలా సీక్వెల్ చేయడానికి, కథని పొడిగించడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి. సీక్వెల్ కు కావాల్సిన బలమైన సెటప్ ఉంది కాబట్టి నేనే నెల్సన్ కి స్వయంగా కాల్ చేశాను అని తెలిపారు.