Vijay Deverakonda : విజయ్ దేవరకొండ బైక్ రేసింగ్.. మోకాళ్ళు కొట్టుకుపోయి..
ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. (Vijay Deverakonda)
Vijay Deverakonda
Vijay Deverakonda : గత కొంతకాలంగా ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు దసరాకు రణబాలి సినిమాతో రాబోతున్నాడు. అక్టోబర్ 16న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ తో రణబాలి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Also See : Anaswara Rajan : తులాభారం పూజా కార్యక్రమంలో అనశ్వర రాజన్. ఫోటోలు వైరల్..
విజయ్ దేవరకొండ.. ఈ సినిమా కోసం నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. హార్స్ రైడింగ్ నేర్చుకునేటప్పుడు కచ్చితంగా కింద పడతారు. కింద పడితే కేక్ కట్ చేసి పార్టీ ఇవ్వాలంట. అది రూల్ అంట. గతంలో నేను బైక్ రేసింగ్ చేసినప్పుడు కూడా ఇలాగె బైక్ మీద నుంచి ఫస్ట్ టైం కింద పడితే పార్టీ ఇవ్వాలి అనేవాళ్ళు. నేను బైక్ రేసింగ్ చేశాను. ట్రాక్ మీద కంప్లీట్ గా బైక్ ని వంపి రేసింగ్ చేశాను. ఓ సారి 200 స్పీడ్ లో రేసింగ్ చేసినప్పుడు కింద పడ్డాను మోకాలు కొట్టుకుపోయింది. బైక్ అయితే చాలా దూరం ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. 25 – 30 ఏళ్ళ వయసు మధ్యలో బైక్ రేసింగ్ చేశాను. ఇప్పుడు మాత్రం అంత రిస్క్ లు చేయలేను అని అన్నారు.
