Rajinikanth: ఈ డైరెక్టర్ కూడా చేతులెత్తేశాడట.. మొదలవకుండానే ఆగిపోయిన రజనీకాంత్ మూవీ

రజనీకాంత్(Rajinikanth) 173వ సినిమా నుంచి తప్పుకున్న దర్శకుడు సిబి చక్రవర్తి.

rajinikanth doing his next movie with ashwath marimuthu

  • రజనీకాంత్ 173వ సినిమాలో మార్పు
  • ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సిబి చక్రవర్తి
  • అశ్వత్ మరిముత్తు కథకు రజనీ ఫిదా

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. క్రేజీ ప్రాజెక్టులను ఒకే చేస్తూ కుర్ర హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటికే, నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన, తన 173వ సినిమాను కూడా పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన మార్పు జరిగినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ చిత్రానికి ‘డాన్’ చిత్ర దర్శకుడు సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తారని అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి డైరెక్టర్ తప్పుకున్నట్లు తెలుస్తోంది.

Ram Pothineni: ఎవరూ లేకపోయినా హ్యాపీనే.. పెళ్లిపై రామ్ షాకింగ్ కామెంట్స్

సిబి చక్రవర్తి తప్పుకోవడంతో ఆ స్థానంలోకి ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మరిముత్తు వచ్చి చేరినట్టు సమాచారం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అశ్వత్ మాట్లాడుతూ, తాను రజనీకాంత్‌(Rajinikanth)కు ఒక అద్భుతమైన కథను వినిపించానని, అది విన్న వెంటనే సూపర్ స్టార్ ఎంతో ఇంప్రెస్ అయ్యారని వెల్లడించారు. అశ్వత్ చెప్పిన కథలోని కొత్తదనం, ఆయన మేకింగ్ స్టైల్ రజనీకి బాగా నచ్చడంతో, తన 173వ సినిమా బాధ్యతలను ఆయనకే అప్పగించాలని తలైవర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే, ఈ విషయంపై మేకర్స్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ, అశ్వత్ మరిముత్తు, రజనీకాంత్ కాంబినేషన్ దాదాపు ఖరారైనట్లు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో, సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. రజనీకాంత్ తన మార్క్ స్టైల్‌తో పాటు యువ దర్శకుల విజన్‌ను ఎలా జోడిస్తారో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.