Ram Pothineni: ఎవరూ లేకపోయినా హ్యాపీనే.. పెళ్లిపై రామ్ షాకింగ్ కామెంట్స్
పెళ్లి, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన రామ్ పోతినేని(Ram Pothineni).
ram pothineni interesting comments on marriage
- ఏకాంతంలోనే అసలైన ఆనందం
- ఎవరూ లేకపోయినా హ్యాపీనే
- పెళ్లిపై రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Ram Pothineni: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల గురించి పక్కన పెడితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో రామ్ ఒకడు. ఆయన పెళ్లి వార్తలు కూడా చాలా కాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా రామ్ తన పెళ్లి, సింగిల్ స్టేటస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఏకాంతంగా ఉండటం ఎంతో ఇష్టమని, అది చిన్నప్పటి నుంచే అలవాటైన విషయమని ఆయన స్పష్టం చేశారు.
Devara 2: ‘దేవర 2’లో మక్కల్ సెల్వన్.. తారక్‌తో తలపడనున్న విజయ్ సేతుపతి!
ఖాళీ సమయం దొరికితే స్నేహితులతో గడపడం కంటే, తన కోసం తాను సమయాన్ని కేటాయించుకోవడంలోనే ఎక్కువ ప్రశాంతతను వెతుక్కుంటానని రామ్ తెలిపారు. ఇది తాను కావాలని తీసుకున్న నిర్ణయం కాదని, తన సహజ సిద్ధమైన వ్యక్తిత్వమని ఆయన పేర్కొన్నారు. సినిమా షూటింగ్‌ల సమయంలో వందలాది మంది మధ్య ఉన్నప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకున్నానని ఆయన వివరించారు.
ముఖ్యంగా లాక్డౌన్ కాలంలో ఏడాదిన్నర పాటు ఒంటరిగా గడిపిన క్షణాలను రామ్(Ram Pothineni) గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో తన జీవితంలోకి ఎవరైనా వస్తే వారితో సమయం పంచుకోవడానికి సిద్ధమేనని, ఒకవేళ ఎవరూ రాకపోయినా ఒంటరిగానే మరింత సంతోషంగా ఉంటానని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ తన ఒంటరితనాన్ని బలహీనతగా కాకుండా, ఒక ఆనందకరమైన అనుభూతిగా చూడటం విశేషం. ఇక సినిమాల విషయానికి వస్తే, రామ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ తో ఓ సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు.
