Rajinikanth Family : రజినీకాంత్ ఫుల్ ఫ్యామిలీ ఫొటో వైరల్.. ఎవరెవరు ఉన్నారంటే.. ధనుష్ కూడా ఉంటే బాగుండు..
రజినీకాంత్ తన ఫ్యామిలీతో కలిసి గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ కి హాజరయ్యారు. (Rajinikanth Family)
- Saketh U
- Published On : November 29, 2025 / 09:47 PM IST
Rajinikanth Family
Rajinikanth Family : సెలబ్రిటీలు, సినీ స్టార్స్ ఫుల్ ఫ్యామిలీ ఫోటోలు బయటకు వస్తే ఫ్యాన్స్ తెగ వైరల్ చేసేస్తారు. తాజాగా రజినీకాంత్ ఫుల్ ఫ్యామిలీ ఫొటో వైరల్ గా మారింది. రజినీకాంత్ తన ఫ్యామిలీతో కలిసి గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ కి హాజరయ్యారు. అక్కడ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.(Rajinikanth Family)
రజినీకాంత్ ఫుల్ ఫ్యామిలీ ఫొటోలో ఆయన భార్య లత, కూతుర్లు ఐశ్వర్య రజినీకాంత్, సౌందర్య రజినీకాంత్, చిన్నల్లుడు విశాగన్ వనంగమూడి, పెద్ద కూతురు పిల్లలు యాత్ర, లింగ, చిన్న కూతురు కొడుకు వీర్ రజినీకాంత్.. ఉన్నారు. ఈ ఫొటోలో ధనుష్ కూడా అంటే బాగుండు అని పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య – ధనుష్ కొన్నాళ్ల క్రితమే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇక ధనుష్ పెద్ద కొడుకు యాత్ర అయితే అచ్చు ధనుష్ లాగే ఉన్నాడు. దీంతో ధనుష్ ఫ్యాన్స్ తమ వారసుడు వచ్చాడు అని ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
