JAILER 2 Trailer : రజినీకాంత్ జైలర్ 2 ట్రైలర్ వచ్చేసింది.. టైగర్ ముత్తువేల్ పాండియన్ ఈజ్ బ్యాక్
రజినీకాంత్ నటిస్తున్న జైలర్ 2 చిత్ర ట్రైలర్ (JAILER 2 Trailer) వచ్చేసింది.
- Thota Vamshi Kumar
- Published on- October 5, 2026 / 06:28 PM IST
Rajinikanth JAILER 2 Trailer
JAILER 2 Trailer : సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన జైలర్ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా ఈ చిత్రానికి స్వీకెల్ తెరకెక్కుతోంది. జైలర్ 2గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఎస్‌జే సూర్య, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడి, విద్యాబాలన్‌లు కీలక పాత్రల్లో నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడడంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
