Rajinikanth : 43ఏళ్ళ దాంపత్యం.. ప్రతి ఏడాది పెళ్లిరోజున రజినీకాంత్ దంపతులు ఏం చేస్తారో తెలుసా..!
రజినీకాంత్, లతా 43ఏళ్ళ దాంపత్యం. ప్రతి ఏడాది పెళ్లిరోజున రజినీకాంత్ దంపతులు ఏం చేస్తారో తెలుసా..!
- gum 95921
- Published on- February 28, 2024 / 12:57 PM IST
Rajinikanth Latha celebrates their 43 years marriage relationship
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రొఫిషినల్ లైఫ్ లోనే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా సక్సెస్ ఫుల్ మెన్ అనిపించుకున్నారు. ఒక నటుడిగా సినిమా రంగంలో నిబద్దతతో నడిచిన రజినీకాంత్.. ఒక భర్తగా కూడా తన జీవిత బాగస్వామితో అలాగే నడుస్తూ వచ్చారు. 1981లో రజినీకాంత్, లతాని వివాహం చేసుకున్నారు. లతా కూడా సినిమా రంగంలో పని చేశారు. సింగర్‌గా, ప్రొడ్యూసర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా లతా పని చేసారు.
ఇక ఈ సూపర్ జంట.. 43 ఏళ్లుగా ఒకటిగా ప్రయాణిస్తూనే వస్తున్నారు. వీరిద్దరికి ఇద్దరి ఆడ పిల్లలు ఐశ్వర్య, సౌందర్య ఉన్న సంగతి తెలిసిందే. కాగా అమ్మానాన్న పెళ్లిరోజునాడు సౌందర్య రజినీకాంత్.. ఒక ఆసక్తికర పోస్టు వేశారు. ఆ పోస్టుతో ప్రతి ఏడాది పెళ్లిరోజున రజినీకాంత్ దంపతులు ఏం చేస్తారో అందరికి తెలియజేసారు. ఇంతకీ రజినీకాంత్ దంపతులు పెళ్లిరోజున ఏం చేస్తారు.
Also read : Vyooham : ఇంకెన్ని సార్లు వాయిదా.. మళ్ళీ పోస్టుపోన్ అయిన ఆర్జీవీ ‘వ్యూహం’..
సౌందర్య షేర్ చేసిన ఫొటోలో రజినీకాంత్ తన మెడలోని గోల్డ్ చైన్, చేతికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ కనిపిస్తున్నారు. అలాగే లతా ఆమె చేతికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తున్నారు. అవి 43 ఏళ్ళ క్రిందట పెళ్లి సమయంలో మార్చుకున్న ఉంగరాలు అంట. ప్రతి ఏడాది పెళ్లిరోజున వాటిని ధరించి రజినీకాంత్ దంపతులు తమ పెళ్లిరోజుని జరుపుకుంటారంట. సౌందర్య షేర్ చేసిన ఈ విషయం అందర్నీ ఆకట్టుకుంటుంది.
ఇక రజిని సినిమాలు విషయానికి వస్తే.. ‘జై భీమ్’ డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ తో తన 170వ సినిమా ‘వెట్టయన్’ని తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దసరా విజయన్, రక్షన్.. వంటి భారీ తారాగణం కనిపించబోతుంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
