Vyooham : ఇంకెన్ని సార్లు వాయిదా.. మళ్ళీ పోస్టుపోన్ అయిన ఆర్జీవీ ‘వ్యూహం’..
ఇంకెన్ని సార్లు వాయిదా వేస్తారు సార్. మళ్ళీ పోస్టుపోన్ అయిన ఆర్జీవీ ‘వ్యూహం’. ఈసారి డేట్‌కి..

Ram Gopal Varma Vyooham movie release is again postponed
Vyooham : ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా టాలీవుడ్ కాంట్రవర్సియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా సినిమాలు ‘వ్యూహం’, ‘శపథం’. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు.. ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వివాదాలు వల్ల పోస్టుపోన్ అవుతూ వచ్చింది. ‘వ్యూహం’ గత ఏడాది డిసెంబర్‌లో, ‘శపథం’ ఈ ఇయర్ ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉంది.
అయితే ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠని దెబ్బతీసేలా సన్నివేశాలను రూపొందించారని.. నారా లోకేశ్ ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకుంటూ కోర్టులో పిటిషన్ వెయ్యడంతో రిలీజ్ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఎలాగైనా రిలీజ్ చేయాలని పట్టుబట్టిన ఆర్జీవీ.. కోర్టులో పోరాడి రిలీజ్ కి అన్ని అడ్డంకులు తొలిగించుకొని సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.
Also read : Lena : గగన్‌యాన్ వ్యోమగామిని వివాహం చేసుకున్నాను.. మలయాళ నటి లీనా..
కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ‘వ్యూహం’ని ఫిబ్రవరి 23న, ‘శపథం’ని మార్చి 1న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ మళ్ళీ పది రోజుల తరువాత ఆ రిలీజ్స్ ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వ్యూహం సినిమాని మార్చి 1కి, శపథం మూవీని మార్చి 8కి తీసుకు వస్తామంటూ కొత్త రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి డేట్ ని మారుస్తూ ఆర్జీవీ అనౌన్స్ చేశారు.
మార్చి 1న విడుదల కావాల్సిన వ్యూహం సినిమాని ఒకరోజు ఆలస్యంగా మార్చి 2న తీసుకు వస్తున్నట్లు.. ఆర్జీవీ స్వయంగా ప్రకటించారు. వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ పోస్టు చేస్తూ.. పట్టు వదలని విక్రమార్కుడని అంటూ రాసుకొచ్చారు. కాగా ఈ చిత్రాన్ని U/A సర్టిఫికెట్ ని ఇచ్చారు. మొత్తం 2 గంటల 1 నిమిషం 37 సెకన్ల నిడివితో ఈ చితం ఆడియన్స్ ముందుకు వస్తుంది.
పట్టు వదలని విక్రమార్కున్ని .. VYOOHAM in theatres MARCH 2nd ? pic.twitter.com/DoGK95a4PB
— Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024