Rajinikanth : రజినీకాంత్‌కి అదే చివరి సినిమా.. తమిళ దర్శకుడు సంచలన కామెంట్స్!
రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. అయితే సైన్ చేసిన ఈ సినిమాల తరువాత రజినీ వెండితెరకు గుడ్ బై చెప్పబోతున్నాడు.
- gum 95921
- Published On : May 19, 2023 / 01:26 PM IST
Rajinikanth say good bye to movies after Lokesh Kangaraj film
Rajinikanth Movie : సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఇటీవల మూడు సినిమాలు లైన్ లో పెట్టడం, వాటిలో రెండు చిత్రాలను పట్టాలు ఎక్కించి శరవేగంగా చిత్రీకరణ జరుపుతుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఒక వార్త తలైవా ఫ్యాన్స్ ని కలవర పెడుతుంది. 170కి పైగా చిత్రాల్లో నటించిన రజనీ.. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ ప్రముఖ తమిళ దర్శకుడు మిస్కిన్ (Miskin) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Lal Salaam : ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో.. లాల్ సలామ్‌లో రజినీకాంత్, కపిల్ దేవ్..
మిస్కిన్ రజినీ గురించి మాట్లాడుతూ.. “రజినీకాంత్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతనితో సినిమా చేయాలనీ రజినీనే స్వయంగా అడిగారు. బహుశా అదే రజనీకాంత్ చివరి సినిమా అవ్వొచ్చు” అంటూ వెల్లడించాడు. మరి ఈ వ్యాఖ్యలు ఎంతవరకు నిజమో తెలియదు. అయితే రజినీకాంత్ సినిమాలకు గుడ్ బై చెబుతున్నాడు అంటూ వార్తలు రావడం ఇది తొలిసారి కాదు. బాబా సినిమా సమయంలో కూడా రజినీ ఇక పై సినిమాల్లో కనిపించాడని వార్తలు వచ్చాయి. కానీ మూడేళ్ళ విరామం తరువాత చంద్రముఖితో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.
Rajinikanth : ఎన్టీఆర్ వలనే రజినీకాంత్ నటుడు అయ్యాడు.. ఆ కథ ఏంటో తెలుసా?
ఇక ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దర్శకత్వంలో జైలర్ (Jailer) సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆగష్టు నెలలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటు తన కూతురు ఐశ్వర్యా రజినీకాంత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘లాల్ సలామ్’ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) ఒక గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
