రాజు గారి గది 3’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ టీమ్ ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది..
‘రాజుగారి గది’, ‘రాజుగారి గది 2’ సినిమాల తర్వాత ‘రాజు గారి గది 3’ తో ప్రేక్షకులను భయపెట్టబోతున్నాడు ఓంకార్.. రాజు గారి గది ఫ్రాంచైజీలో ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రాజు గారి గది 3’ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఓంకార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రాజు గారి గది 3’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
సినిమా చూసిన సెన్సార్ టీమ్ ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ, ఊర్వశి, అజయ్ ఘోష్ తదితరులు నటించిన ‘రాజు గారి గది 3’ అక్టోబర్ 18న గ్రాండ్‌గా విడుదల కానుంది.
మాటలు : సాయిమాధవ్ బుర్రా, కెమెరా : చోటా కె. నాయుడు, ఎడిటింగ్ : గౌతంరాజు, సంగీతం : షబ్బీర్, పాటలు : శ్రీమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కళ్యాణి చక్రవర్తి, ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్, ఆడియోగ్రఫీ : రాధాకృష్ణ.