×
Ad

Raju Weds Rambai Review : ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రివ్యూ.. బాబోయ్ ఇదెక్కడి క్లైమాక్స్ రా బాబు..

ఓ పల్లెటూళ్ళో జరిగిన యదార్థ కథ అని ఈ సినిమాని ప్రమోట్ చేశారు. (Raju Weds Rambai Review)

Raju Weds Rambai Review

Raju Weds Rambai Review : అఖిల్ రాజ్, తేజస్విని జంటగా తెరకెక్కిన సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మాణంలో సాయిలు కంపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రాజు వెడ్స్ రాంబాయి సినిమా నవంబర్ 21న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ సినిమాని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ముందు రోజే ఈ సినిమాకు ప్రీమియర్స్ వేశారు.(Raju Weds Rambai Review)

కథ విషయానికొస్తే.. ఇది 2010లో జరిగిన కథ. ఓ మారుమూల పల్లెటూరులో రాజు(అఖిల్) బ్యాండ్ కొడుతూ ఫ్రెండ్స్ తో సరదాగా తిరుగుతూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అదే ఊళ్లో రాంబాయి(తేజస్వి) చదువుకుంటూ ఉంటుంది. రాజు రాంబాయిని ఎప్పటినుంచో ప్రేమిస్తూ ఉంటాడు. ఒక సమయంలో తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఆమెకు తెలిసేలా చేసి ప్రపోజ్ చేస్తాడు రాజు. మొదట ఇష్టంలేకపోయినా రాజు ప్రేమ చూసి ఇష్టపడుతుంది. రాంబాయి తండ్రి వెంకన్న(చైతూ జొన్నలగడ్డ) హాస్పిటల్ లో గవర్నమెంట్ జాబు. తన కూతురికి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు.

రాజు తండ్రి(శివాజీరాజా) రాజును హైదరాబాద్ కు వెళ్లి సంపాదించమని చెప్తుంటాడు. రాజు రాంబాయి ప్రేమ అలా సాగుతూ ఉండగా ఓ రోజు వీరిద్దరి మధ్య గొడవ వచ్చి రాజు రాంబాయి ఇంటికి వెళ్లి ఆమెను కొడతాడు. ఈ విషయం ఊళ్లో అందరికి తెలియడంతో వెంకన్న రాజు ఇంటి మీద వచ్చి గొడవ పెట్టుకుంటాడు. ఆ ఘటనతో రాజు తండ్రి చనిపోతాడు. దీంతో రాజు రాంబాయి దూరమవుతారు. మరి రాజు రాంబాయి కలిసారా? వాళ్ళు పెళ్లి చేసుకున్నారా? రాజుతో పెళ్లికి వెనకన్నా ఒప్పుకుంటాడా? రాజు హైదరాబాద్ వెళ్ళాడా? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Paanch Minar Review : ‘పాంచ్ మినార్’ మూవీ రివ్యూ.. క్రైం కామెడీతో రాజ్ తరుణ్ హిట్ కొట్టాడా?

సినిమా విశ్లేషణ.. ఓ పల్లెటూళ్ళో జరిగిన యదార్థ కథ అని ఈ సినిమాని ప్రమోట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో – హీరోయిన్ మధ్య క్యూట్ లవ్ స్టోరీతో సాగుతుంది. 2010 కావడంతో 90s కిడ్స్ ఈ లవ్ స్టోరీకి, హీరో -ఫ్రెండ్స్ మధ్య సన్నివేశాలకు బాగానే కనెక్ట్ అవుతారు. ఫస్ట్ హాఫ్ అంతా నవ్విస్తూ క్యూట్ లవ్ స్టోరీ తో మెప్పిస్తూ సాగుతుంది. అప్పడి పాటలు, అప్పటి ఫోన్స్.. అవన్నీ జనాలకు బాగానే కనెక్ట్ అవుతాయి. ఇంటర్వెల్ కి ముందు హీరో – హీరోయిన్స్ మధ్య గొడవ, తండ్రి చనిపోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది.

సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్ తో, లవ్ స్టోరీతోనే సాగుతుంది. వెంకన్న వీళ్ళ ప్రేమని ఒప్పుకోకుండా ఏం చేసాడు అని వెంకన్న చుట్టూ రాసుకున్న సీన్స్ బాగుంటాయి. సెకండ్ హాఫ్ లో కూడా అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసారు. క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరు. ఇలా కూడా చేసారా అనే ఆశ్చర్యం కలుగుతుంది. క్లైమాక్స్ అంతా ఫుల్ గా ఎమోషన్ చేయాలనుకున్నారు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇలాంటి సీన్స్ కి కన్నీళ్లు రావాలి కానీ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. హీరో మాటికీ మాటికీ WWE లో ఓ డైలాగ్ చెప్తుంటాడు. అది ఎందుకు చెప్తాడో హీరోకే, డైరెక్టర్ కె తెలియాలి.

హీరో క్యారెక్టర్ ఒకసారి ప్రేమగా, ఒకసారి కోపంగా, ఒకసారి పిచ్చిగా ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియకుండా రాసుకున్నారు. బహుశా ఆ క్యారెక్టర్ అంతేనేమో. వెంకన్నని అవిటివాడిగా మొదటినుంచి బాగా పొగరు ఉన్న వ్యక్తిగా చూపించి తన అవిటితనానికి క్లైమాక్స్ కి చేసిన లింక్ క్లారిటీ బాగుంది. ఈ క్యారెక్టర్ బాగా రాసుకున్నారు. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం సాగదీశారు. హైదరాబాద్ లో పెట్రోల్ బంక్ సీన్స్ ఎందుకు అనిపిస్తాయి. కొన్ని కొన్ని సీన్స్ ఇంకా ఎంతసేపు అనిపిస్తాయి. పరువు హత్యల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. ఇది కూడా ఒకరకంగా అలాంటి సినిమానే. మరి ఈ క్లైమాక్స్ ఎంతమందికి నచ్చుతుందో. క్లైమాక్స్ కాకుండా సినిమా అంతా ఎంటర్టైనింగ్ గా, లవ్ స్టోరీతో బాగానే నడిపించారు. ఇది యదార్థ కథ అని చెప్పినా ఒక క్లైమాక్స్, సెకండ్ హాఫ్ లోని కొన్ని సీన్స్ తప్ప మొత్తం సినిమాటిక్ గానే మార్చుకొని తెరకెక్కించారు.

నటీనటుల పర్ఫార్మెన్స్..

షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లతో మెప్పించిన అఖిల్ ఈ సినిమాలో ఒక గ్రామీణ ప్రేమికుడు పాత్రలో తను ప్రేమ ఎక్కడ దూరమవుతుందో అనే కోపంతో బాధతో రగిలిపోయే పాత్రలో బాగా నటించాడు. కాకపోతే కొన్ని కొన్నిచోట్ల అది మరీ ఓవరాక్షన్ అనిపిస్తుంది. షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమ్ తెచ్చుకుని ఇటీవల కమిటీ కుర్రోళ్ళు సినిమాలో మెప్పించిన తేజస్వి ఈ సినిమాలో గ్రామీణ యువతీ పాత్రలో అదరగొట్టేసింది. ఎలాంటి మేకప్ లేకుండా విలేజ్ అమ్మాయి ఎలా ఉంటుందో అలా సింపుల్ గా కనిపిస్తూ ప్రేమ సన్నివేశాల్లోనూ ఎమోషనల్ సీన్స్ లోనూ చాలా అద్భుతంగా నటించింది. తేజస్వి తెలుగమ్మాయి కావడం విశేషం. భవిష్యత్తులో ఇలాంటి రూటెడ్ గ్రామీణ సినిమాలకు తేజస్వి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

ఇక వెంకన్న పాత్రలో అవిటివాడిగా చైతూ జొన్నలగడ్డ చాలా బాగా నటించాడు. ఏమీ చేయలేని అవిటివాడిగా, పొగరుతో ఉండే పాత్రని బాగా పండించాడు. సినిమా అంతా అవిటివాడిగా నటించడానికి బాగానే కష్టపడ్డాడు. రాజు తండ్రి పాత్రలో శివాజీ రాజా కూడా బాగా మెప్పించాడు. రాజు ఫ్రెండ్ డాంబర్ అనే పాత్ర చేసిన నటుడు ఫుల్లుగా నవ్విస్తాడు. అనిత చౌదరి.. మిగిలిన నటీనటులు వారి పాత్రలో బాగా మెప్పించారు.

Also Read : Chiranjeevi : చరణ్ ఆ సినిమా చూపిస్తే కానీ అన్నం తినేవాడు కాదు.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి సినిమా అంతా మారుమూల గ్రామంలో తీయడంతో పల్లెటూరు అందాలు, పచ్చని పొలాలు, కొండలు.. ఇవన్నీ మంచి విజువల్స్ లో చూపించారు ఈ సినిమాకు మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సురేష్ బొబ్బిలి అదరగొట్టేసారు. సినిమా రిలీజ్ ముందే ఈ సినిమాలోని రాంబాయి అనే పాట బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ పాటతో పాటు మిగిలిన పాటలు కూడా సినిమాలో చాలా చక్కగా మెప్పిస్తాయి. ఈ సినిమాకి మ్యూజిక్ ప్రాణం పోసింది.

ఎడిటింగ్ పరంగా కూడా బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం సాగదీత అనిపిస్తుంది. ఒకటి రెండు సీన్లు పూర్తిగా, అక్కడక్కడ కొన్ని సీన్లు సెకండ్ హాఫ్ లో షార్ప్ కట్ చేస్తే బాగుండు. కొత్త దర్శకుడు ఓ ఊర్లో జరిగిన కథని చెప్పాలని దాన్ని సినిమాటిక్ గా ఒక అందమైన ప్రేమ కథగా మార్చి చక్కగా తెరకెక్కించాడు. నిర్మాణపరంగా కూడా ఈ సినిమాకు కావలసినంత ఖర్చు పెట్టి మంచి అవుట్ ఇచ్చారు.

మొత్తంగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ గ్రామీణ ప్రేమ కథ నవ్విస్తూనే మన టీనేజ్ గుర్తు చేస్తూ ఓ చిన్న ఎమోషన్ ని చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.