Rakesh Varre : మిర్చి సినిమా చేయనన్నాను.. బాహుబలిలో నా సీన్స్ మొత్తం ఎడిటింగ్ లో పోయాయి..
రాకేష్ వర్రే ప్రభాస్ మిర్చి, బాహుబలి సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. (Rakesh Varre)
- Saketh U
- Published on- November 10, 2026 / 05:54 PM IST
Rakesh Varre
Rakesh Varre : ఎప్పుడో జోష్ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రాకేష్ వర్రే ఆ తర్వాత అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఎవరికీ చెప్పొద్దు సినిమాతో హీరోగా మారి పేకమేడలు, జితేందర్ రెడ్డి సినిమాలతో హీరోగా మెప్పించాడు. ఇప్పుడు మాయలేడి సినిమాతో రాబోతున్నాడు రాకేష్ వర్రే. ఈ సినిమా నవంబర్ 13న రిలీజ్ కానుంది.
రాకేష్ వర్రే ప్రభాస్ మిర్చి, బాహుబలి సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. మిర్చిలో ప్రభాస్ ఓపెనింగ్ ఫైట్ సీక్వెన్స్ రాకేష్ తోనే. బాహుబలిలో ఆడవాళ్ళ మీద చెయ్యి వేస్తే నరకాల్సింది వేలు కాదు తల అని నరికేది రాకేష్ నే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాకేష్ వర్రే ఈ రెండు సినిమాల గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు.
Also Read : Renu Desai : పడిపోయిన వాళ్లని తొక్కడం అమానుషం.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్..
రాకేష్ వర్రే మాట్లాడుతూ.. మిర్చి సినిమాలో నేను మొదట నటించను అని చెప్పాను. కానీ తర్వాత ఆఫీస్ కి పిలిచి కొరటాల శివ, మూవీ టీమ్ మాట్లాడి ఒప్పించారు. ఇటలీకి తీసుకెళ్లి అక్కడ షూటింగ్ చేసారు. అదే సీన్ కొంత ఇక్కడ కూడా షూట్ చేసారు. కానీ ఇటలీలో షూట్ చేసింది ఎడిటింగ్ లో తీసేసారు. మిర్చి సినిమాలో సీన్ కి మంచి అప్లాజ్ వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ గారితో బాహుబలి సినిమా చేశాను.
అసలు నా షూటింగ్ లో సెకండ్ పార్ట్ లో ఉన్న నా సీన్ మొదట 2013 లో షూట్ చేసారు. పార్ట్ 1లో ఉండే వార్ సీక్వెన్స్ లో కూడా నేను చాలా సీన్స్ లో ఉన్నాను కానీ ఎడిటింగ్ లో అవన్నీ లేచిపోయాయి. బాహుబలి 2 లో తల నరికే సీన్ కి థియేటర్ షేక్ అయిపొయింది. మా అమ్మ కూడా ఆ సీన్ చూసి క్లాప్స్ కొట్టింది. నా సీన్స్ చాలానే ఎడిటింగ్ లో పోయినా ఒక్క సీన్ తో చాలా హైప్ వచ్చింది అనిపించిందని తెలిపాడు.
