Renu Desai : పడిపోయిన వాళ్లని తొక్కడం అమానుషం.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్..
చీరకట్టులో ట్రెడిషినల్ లుక్స్ లో ఉన్న పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఆసక్తికర పోస్ట్ చేసింది. (Renu Desai)
Renu Desai
Renu Desai : సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు అంశాలపై స్పందించే రేణు దేశాయ్ తాజాగా చీరకట్టులో ట్రెడిషినల్ లుక్స్ లో ఉన్న పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఆసక్తికర పోస్ట్ చేసింది.
రేణు దేశాయ్ తన పోస్ట్ లో.. ఒక వ్యక్తి కష్టంలో ఉంటె వాళ్ళని ఇంకా దూషించడం నైతికంగా కరెక్ట్ కాదు. ఇప్పటికే కాస్త పడిపోయిన వాళ్లని తొక్కడం అమానుషం. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు కూడా ఒక మనిషి. వాళ్ళు కూడా ఒకరి సంతానం, ఒక పేరెంట్, లేదా ఎవరైనా తోబుట్టువు అని మార్చిపోకూడదు. మనమే అసంపూర్ణమైన అద్దాల ఇళ్లలో నివసిస్తున్నప్పుడు దయచేసి ఇతరుల ఇళ్లపై రాళ్లు రువ్వకండి. మనమందరం మానవులం. సానుభూతి, దయ మానవులుగా పిలవబడే మనకు మొదటి ప్రాథమిక అవసరాలు. నేను ఈ మాటలు రాశాను కాబట్టి మీ తెలివితక్కువ ఊహాగానాలు ప్రారంభించవద్దు ఎందుకంటే సహజంగా మనం మంచిగా చేయగలమని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. నేను దయగా, తెలివిగా ఉండటానికి ఏ పేటిఎమ్ ని పొందలేదు. ఇది నా మెదడు ద్వారా చేసే పనులు మాత్రమే అని పోస్ట్ చేసారు.
Also Read : Priya Bhavani Shankar : పెళ్లి చేసుకోబోతున్న ఇరుముడి హీరోయిన్.. ఫోటోలు వైరల్..
అయితే ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టింది అనేది చర్చగా మారింది. తాజాగా పవన్ కళ్యాణ్ – అన్నా లెజినోవా విడిపోయినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో రేణు దేశాయ్ ఈ పోస్ట్ పెట్టడంతో వారిని ఉద్దేశించేనా అని చర్చ మొదలయింది.
