Jithender Reddy : ‘జితేందర్ రెడ్డి’ ట్రైలర్ రిలీజ్.. పొలిటికల్ బయోపిక్..

జితేందర్ రెడ్డి సినిమా నవంబర్ 8న రిలీజ్ కాబోతుంది.

Rakesh Varre Jithender Reddy Movie Trailer Released

Jithender Reddy : ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాతగా విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జితేందర్ రెడ్డి. రాకేష్ వర్రె టైటిల్ రోల్ లో నటించారు. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల ప్రజా సమస్యల కోసం పోరాడిన జితేందర్ రెడ్డి జీవిత కథతో పొలిటికల్ డ్రామాగా రానుంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

Also Read : Jai Hanuman : జై హనుమాన్ షూట్ మొదలయిందా? ప్రశాంత్ వర్మ – రిషబ్ శెట్టి వర్కింగ్ స్టిల్ వైరల్..

జితేందర్ రెడ్డి సినిమా నవంబర్ 8న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. కాలేజీ రోజుల నుంచే జితేందర్ రెడ్డి ప్రజా సమస్యల కోసం, నక్సలైట్ల తో ఎలా పోరాడాడు, ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు అని సినిమాలో చూపించబోతున్నట్టు తెలుస్తుంది.

మీరు కూడా జితేందర్ రెడ్డి ట్రైలర్ చూసేయండి..