Rakshit Atluri – Komalee Prasad : మలయాళ హీరోయిన్స్‌కి హారతులు.. కానీ తెలుగు యాక్ట్రెస్‌ని టాలీవుడ్‌లో కూడా తక్కువగానే..

మలయాళ హీరోయిన్స్‌కి హారతులు ఇస్తారు. కానీ తెలుగు యాక్ట్రెస్‌ని టాలీవుడ్‌లో కూడా తక్కువగానే చూస్తారు..

Rakshit Atluri Komalee Prasad comments about telugu girls position in tollywood

Rakshit Atluri – Komalee Prasad : టాలీవుడ్‌లో ఒకప్పుడు తెలుగు హీరోయిన్స్ హవా కూడా కనిపించేది. కానీ రాను రాను అది తగ్గుతూ వచ్చింది. మొన్నటివరకు టాలీవుడ్ సినిమాల్లో ఒక తెలుగు హీరోయిన్ గా కనిపించేది కాదు. అయితే ‘బేబీ’ మూవీ తరువాత నుంచి పరిస్థితి మారింది. ఆ సినిమా చిన్న చిత్రాలకు సరికొత్త జోష్ ఇవ్వడమే కాదు, తెలుగు అమ్మాయిల్లో కూడా ఎంతో టాలెంట్ ఉంటుందని తెలియజేసింది.

దీంతో ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ కనిపిస్తున్నారు. అయితే టాలెంట్ చూసి సినిమా అవకాశాలు ఇస్తున్నారు గాని.. గౌరవం, ప్రేమ ఇవ్వడం లేదని కొందరు బాధ పడుతున్నట్లు ఇండస్ట్రీలో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం పై తెలుగు అమ్మాయి కోమలీ ప్రసాద్ మాట్లాడారు. ఇటీవల తాను చేసిన కొన్ని కామెంట్స్ తప్పుగా బయటకు వెళ్లాయని.. ‘శశివదనే’ మూవీ ఈవెంట్ లో కోమలీ వివరణ ఇచ్చారు.

బాలీవుడ్ లో తెలుగు అమ్మాయి అని తెలిస్తే ర్యాగింగ్ చేస్తారట. అందుకనే అక్కడ తెలుగు అమ్మాయి అని చెప్పుకోవడానికి ఆలోచిస్తారట. అయితే మన టాలీవుడ్ లో కూడా తెలుగు అమ్మాయి అనే విషయాన్ని బయట పెట్టకూడదని, ముంబై అమ్మాయి అంటూ మెయిన్‌టైన్ చేయాలని అప్పుడే అవకాశాలు వస్తాయి అంటూ కొందరు చెబుతుంటారట.

Also read : Ram Charan : త్రిష లేదా జాన్వీ.. రామ్‌చరణ్ కుక్కపిల్ల ఫాలోయింగ్ కూడా మాములుగా లేదుగా..

కానీ దర్శకనిర్మాతలకు అలా ఏమి ఉండదని, వారికీ కూడా తెలుగు అమ్మాయిలే కావాలని ఉంటుందని, అనవసరంగా ఒక అపోహని సృష్టించి తెలుగు అమ్మాయిలు తాము తెలుగు వాళ్ళమే అని చెప్పుకోకుండా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను తమిళంలో సినిమా చేస్తున్నప్పుడు.. తెలుగు అమ్మాయిల డెడికేషన్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ కంప్లిమెంట్స్ ఇస్తారు అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఇదే ఈవెంట్ లో ఉన్న హీరో రక్షిత్ మాట్లాడుతూ.. “మలయాళ హీరోయిన్స్‌కే హారతులు ఇస్తారా..? తెలుగు హీరోయిన్స్ ఇవ్వరా..?” అంటూ ఇటీవల మమితా బైజుకి ఇచ్చిన హారతిని నిలదీస్తూ క్వశ్చన్ చేసారు. రక్షిత్ క్వశ్చన్ చేసిన ఈ కామెంట్స్ తో కోమలీ మాట్లాడుతూ.. “మాకు హారతులు అవసరం లేదు. జస్ట్ మా సినిమాని, మమ్మల్ని ప్రేమించండి చాలు” అంటూ కోరారు.

ట్రెండింగ్ వార్తలు