×
Ad

Sasivadane : అశ్లీలతకు తావు లేకుండా సినిమా చేశాం.. ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న శశివదనే..

త కొన్నాళ్లుగా వాయిదా పడుతున్న ఈ సినిమా ఎట్టకేలకు అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. (Sasivadane)

Sasivadane

Sasivadane : రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా తెరకెక్కిన సినిమా ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మాణంలో సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గత కొన్నాళ్లుగా వాయిదా పడుతున్న ఈ సినిమా ఎట్టకేలకు అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ మీడియాతో మాట్లాడింది.(Sasivadane)

హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ.. సాయి చెప్పిన కథ మొదట నాకు నచ్చలేదు. కథగా అర్థం కాలేదు కానీ ఆయన చెప్పిన సీన్లు నచ్చాయి. ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూశాను. ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ ఇంత వరకు తెలుగులో రాలేదు. శ్రీమాన్ గారు చేసిన పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. అశ్లీలతకు తావు లేకుండా నిజాయితీగా ఓ మంచి సినిమాను చేశాం. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆనందంతో బయటకు వస్తారు అని అన్నారు.

Also Read : Naga Chaitanya: నాన్నతో పనిచేయడం నరకం.. చాలా ఇబ్బందిగా ఉంటుంది.. ఆ సినిమా కూడా అలానే..

డైరెక్టర్ సాయి మోహన్ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలోకి రావాలన్నది మా నాన్న కల. రక్షిత్ గారు ఓ పది రోజుల షూటింగ్ తరువాత నన్ను గట్టిగా నమ్మారు. సాయి కుమార్‌ నేను రాసుకున్న కథను అందమైన పెయింటింగ్‌లా మార్చాడు. నేను ఎంత అందంగా రాసుకున్నానో అంతకు మించి కోమలి గారు నటించారు. సినిమా చూసాక శ్రీమాన్ గారు చేసిన సింగిల్ షాట్ సీన్ గురించి అందరూ చెప్పుకుంటారు అని తెలిపారు.

నిర్మాత అహితేజ మాట్లాడుతూ.. శశి వదనే కోసం మేం ఎంత కష్టపడ్డా ఆడియెన్స్‌కి మంచి అనుభూతిని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. నాకు అంతగా అనుభవం లేకపోవడంతోనే రిలీజ్‌లో జాప్యం కలిగింది. కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది. సినిమా పూర్తి కాకముందే అన్ని రైట్స్ అమ్ముడుపోయాయి. శశివదనే లాంటి క్లైమాక్స్‌ను నాకు తెలిసినంత వరకు అయితే తెలుగులో ఇంత వరకు చూడలేదు అని అన్నారు. హీరోయిన్ కోమలి ప్రసాద్ మాట్లాడుతూ.. శశివదనే నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఇందులో పోషించిన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది థియేటర్లో మా సినిమా కచ్చితంగా సర్ ప్రైజ్ చేస్తుంది అని తెలిపారు.

Also Read : Vijay-Rashmika: ప్రేమ వీళ్లదే.. కానీ, కారణం మాత్రం ఆ దర్శకుడేనట.. ఇంతకీ ఆ సంగతేంటో!