Operation Raavan : సైకో కిల్లర్ సినిమా ‘ఆపరేషన్ రావణ్’ ఆహా ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎప్పట్నుంచో తెలుసా?

తాజాగా మూవీ యూనిట్ ఆపరేషన్ రావణ్ డిజిటల్ ప్రీమియర్ అనౌన్స్మెంట్ చేశారు.

Rakshit Atluri Operation Raavan Movie Aha OTT Streaming Date Announced

Operation Raavan : పలాస, నరకాసుర లాంటి సినిమాలతో మెప్పించిన హీరో రక్షిత్ అట్లూరి ఇటీవల ఆపరేషన్ రావణ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్ జంటగా రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్ ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. సుధాస్ మీడియా బ్యానర్ పై ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో వెంకట సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఆపరేషన్ రావణ్ సినిమా జులై 26న థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

Also Read : Varun- Lavnya : వరుణ్ – లావణ్య ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ.. స్పెషల్ వీడియో రిలీజ్.. వీడియో అస్సలు మిస్ అవకండి..

తాజాగా మూవీ యూనిట్ ఆపరేషన్ రావణ్ డిజిటల్ ప్రీమియర్ అనౌన్స్మెంట్ చేశారు. ఆపరేషన్ రావణ్ సినిమా ఆహా ఓటీటీలో నవంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో విలన్ ని చివరి వరకు ఎవరు అనేది కనిపెట్టలేరు ప్రేక్షకులు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసే వాళ్ళు ఆహా ఓటీటీలో ఈ సినిమా చూసేయండి.