Rakul Preet Singh: పార్ట్‌నర్ మోసం చేస్తే క్షమించొచ్చా.. మాట మార్చిన రకుల్.. షాకింగ్ కామెంట్స్ వైరల్

పెళ్లి, రిలేషన్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh).

Rakul Preet Singh shocking comments on cheating in relationships.

  • చీటింగ్‌పై రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్
  • ఒక్కసారి తప్పు చేస్తే క్షమించవచ్చునని లాజిక్
  • భర్తకు ఈ రూల్ వర్తించదన్న హీరోయిన్

Rakul Preet Singh: రిలేషన్‌షిప్‌లో నమ్మకద్రోహం అనే అంశంపై బాలీవుడ్ స్టార్స్ ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా హిందీ చిత్రం ‘పతీ పత్నీ ఔర్ వో దో’. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లకు పైగా వసూళ్లతో విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో భాగస్వామి మోసం చేస్తే క్షమిస్తారా అనే ప్రశ్నకు ముగ్గురూ భిన్నమైన అభిప్రాయాలను పంచుకున్నారు.

Peddi: ‘పెద్ది’కి రెండో ట్రైలర్ అవసరం లేదట.. బుచ్చిబాబు నమ్మకం ఏంటో!

మొదటగా సారా అలీ ఖాన్ స్పందిస్తూ, రిలేషన్‌లో మోసం అనేది క్షమించరానిదని, ఒకవేళ పొరపాటు జరిగితే కచ్చితంగా క్షమాపణ చెప్పాలని స్పష్టం చేసింది. దీనికి హీరో ఆయుష్మాన్ ఖురానా కూడా మద్దతు పలికారు. మనుషులు అన్నాక ఎప్పుడో ఒకసారి పొరపాట్లు చేయడం సహజమని, దానికి నిజాయితీగా బాధపడుతూ సారీ చెబితే పెద్ద మనసుతో క్షమించేయడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే ఈ చర్చలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) వైఖరి ప్రత్యేకంగా నిలిచింది. ఒకసారి మోసం చేస్తే ఒప్పుకోనని మొదట చెప్పిన రకుల్, ఆ తర్వాత తన మాట మార్చింది. జీవితం చాలా పెద్దదని, ఎవరైనా తెలియక ఒకే ఒక్కసారి తప్పు చేస్తే జీవితాంతం వారిని క్షమించకుండా ఉండటం సరికాదని సరికొత్త లాజిక్ తీసింది. అయితే ఈ రూల్స్ ఏవీ తన వ్యక్తిగత జీవితానికి, తన భర్తకు మాత్రం వర్తించవంటూ రకుల్ ఇంటర్వ్యూ ముగించింది.