Peddi: ‘పెద్ది’కి రెండో ట్రైలర్ అవసరం లేదట.. బుచ్చిబాబు నమ్మకం ఏంటో!
రామ్ చరణ్ పెద్ది(Peddi) సినిమా రెండో ట్రైలర్ రిలీజ్ చేయడంపై ఆసక్తికర కామెంట్స్.
Ram charan peddi movie second trailer update
- ‘పెద్ది’ మూవీ ప్రమోషన్స్ లో ట్విస్ట్
- మరో ట్రైలర్ వద్దంటున్న దర్శకుడు
- థియేటర్లలోనే అసలైన మ్యాజిక్ ఖాయం
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బ్యాక్-టు-బ్యాక్ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది(Peddi)’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్ పూర్తిగా సరికొత్త మేకోవర్‌లోకి మారిపోయారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటంతో, గ్లోబల్ వైడ్‌గా ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది.
Mrunal Thakur: అందమే అసూయపడేలా.. మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ట్రెడిషనల్ లుక్ వైరల్
అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇటీవల పెద్ది నుంచి విడుదలైన ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, కొంతమంది మాత్రం డిజప్పాయింట్ అయినట్టుగా కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరింత పెంచడం కోసం మరో పవర్ఫుల్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేద్దామని నిర్మాత భావిస్తున్నారట. సినిమా హైప్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లాలంటే రెండో ట్రైలర్ కచ్చితంగా అవసరమని ఆయన అభిప్రాయపడుతున్నారు. కానీ, దర్శకుడు బుచ్చిబాబు సన మాత్రం “వద్దు… ఇదే సరిపోతుంది!” అంటూ నిర్మాత ప్రపోజల్‌కు సున్నితంగా బ్రేకులు వేస్తున్నట్లు సమాచారం.
ట్రైలర్స్ ద్వారా కథలోని కీలకమైన పాయింట్స్, ట్విస్టులు ఎక్కువగా రివీల్ అయిపోతే ప్రేక్షకులు థియేటర్లలో ఆశించిన స్థాయిలో థ్రిల్ అవ్వరని దర్శకుడి నమ్మకం. అందుకే, అసలు మ్యాజిక్‌ను నేరుగా థియేటర్లలోనే చూపించి ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారట. ప్రమోషన్స్ పరిమితంగా ఉన్నా, కంటెంట్‌లోని దమ్ము ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని దర్శకుడు బలంగా నమ్ముతున్నారు. మరి ఈ ప్రమోషన్స్ వార్‌లో చివరికి నిర్మాత మాట గెలుస్తుందో, లేక దర్శకుడి ప్లానే వర్కవుట్ అవుతుందో చూడాలి!
