Rakul Preet Singh : హైదరాబాద్‌లో రకుల్ ప్రీత్ సింగ్ రెస్టారెంట్ బిజినెస్.. ఏ రెస్టారెంట్..? మీరు కూడా వెళ్లి ఫుడ్ ట్రై చేస్తారా?
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ రెస్టారెంట్ బిజినెస్ ని ప్రారంభించింది.
- Saketh U
- Published On : April 17, 2024 / 08:59 AM IST
Rakul Preet Singh Started Restaurant Food Business in Hyderabad in the name of Arambam
Rakul Preet Singh : తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఉన్న రకుల్ ప్రీత్ ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసి అక్కడ వరుస సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో(Jackky Bhagnani) కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపి ఇటీవలే పెళ్లి చేసుకుంది రకుల్. ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా ఫోటోషూట్స్ చేస్తూ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటుంది. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ పలు బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టింది.
ఆల్రెడీ రకుల్ ప్రీత్ సింగ్ F45 జిమ్ బిజినెస్ ఫ్రాంచైజీ ప్రారంభించి సక్సెస్ అయింది. పలు F45 జిమ్, ఫిట్నెస్ సెంటర్స్ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ రెస్టారెంట్ బిజినెస్ ని ప్రారంభించింది. హైదరాబాద్ లోనే తన మొదటి రెస్టారెంట్ ని మొదలుపెట్టడం గమనార్హం. నిన్న హైదరాబాద్ లో ‘ఆరంభం’ అనే పేరుతో రకుల్ ప్రీత్ సింగ్ ఫుడ్ రెస్టారెంట్ బిజినెస్ ని ప్రారంభించింది.
రెస్టారెంట్ తో పాటు ప్యాకింగ్ ఫుడ్ సేల్స్ కూడా ఇక్కడ జరగనున్నట్టు సమాచారం. రకుల్ ప్రీత్ స్వయంగా వచ్చి తన రెస్టారెంట్ ని ప్రారంభించింది. అయితే ఈ రెస్టారెంట్ మరొకరితో కలిసి ప్రారంభించినట్టు సమాచారం. ప్రస్తుతం సినిమాలు, లైఫ్, బిజినెస్ లలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న రకుల్ కి ఈ రెస్టారెంట్ బిజినెస్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక రకుల్ ఆరంభం రెస్టారెంట్ ప్రారంభించిన వీడియోలు, ఫొటోలు వైరల్ గా మారాయి. మీరు కూడా రకుల్ ప్రీత్ ఆరంభం రెస్టారెంట్ కి వెళ్లి ఫుడ్ ట్రై చేయండి మరి..
