Ram Charan – Upasana : చరణ్‌కి ఉపాసన సైగలు.. చరణ్ స్టేజి మీద నుండి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి.. క్యూట్ వీడియో వైరల్..

ఇటీవల రామ్ చరణ్ చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఉపాసన కూడా హాజరైంది.

Ram Charan – Upasana : చరణ్‌కి ఉపాసన సైగలు.. చరణ్ స్టేజి మీద నుండి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి.. క్యూట్ వీడియో వైరల్..

Ram Charan Upasana speaks with mouth signs cute video goes viral

Updated On : April 17, 2024 / 8:40 AM IST

Ram Charan – Upasana : టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ లో రామ్ చరణ్ – ఉపాసన దంపతులు ఒకరు. RRR సినిమా నుంచి ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు. ఇక ఉపాసన అయితే రెగ్యులర్ గా రామ్ చరణ్ గురించి, చరణ్ తో దిగిన ఫోటోలు, ఫన్నీ వీడియోలు, వెకేషన్ ఫొటోలు.. ఏవో ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇటీవల ఎక్కడికి వెళ్లినా ఈ జంట కలిసి వెళ్తున్నారు. తోడుగా తమ చిన్ని పాపాయి క్లిన్ కారాని కూడా తీసుకెళ్తున్నారు.

ఇటీవల రామ్ చరణ్ చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఉపాసన కూడా హాజరైంది. ఈ కార్యక్రమంలో చరణ్ డాక్టరేట్ అందుకున్న ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. అయితే తాజాగా ఈ కార్యక్రమం నుంచి ఓ వీడియో వైరల్ గా మారింది.

Also Read : Tillu Square : 100 కోట్ల ‘టిల్లు స్క్వేర్’ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్.. ఏ ఓటీటీలో? ఎప్పుడు?

రామ్ చరణ్ స్టేజి మీద కూర్చోగా, ఉపాసన స్టేజి ఎదురుగా ఆడియన్స్ లో కూర్చుంది. ఉపాసన చరణ్ కి ఏదో నోటితో సైగలు చేసి చెప్తుంది. దానికి రామ్ చరణ్ కూడా నోటి సైగలతోనే రిప్లై ఇవ్వడం గమనార్హం. ఓ పక్కన కార్యక్రమం జరుగుతుంటే కాసేపు వీళ్ళు నోటి సైగలతో మాట్లాడుకున్నారు. దీంతో ఈ క్యూట్ వీడియో వైరల్ గా మారింది. చరణ్ అభిమానులు క్యూట్ కపుల్ అంటూ ఈ వీడియోని వైరల్ చేస్తూ వాళ్ళు నోటి సైగలతో ఏం మాట్లాడుకుంటున్నారో అని డీ కోడ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ క్యూట్ వీడియో చూసి వాళ్ళేం మాట్లాడుకున్నారో డీ కోడ్ చేయడానికి ప్రయత్నించండి.