Rakul Preet Singh : వైరల్ అవుతున్న రకుల్ పెళ్లి వీడియో.. ఓ రేంజ్‌లో ఉందిగా..
రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ జంట పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాను తలపిస్తున్న వీరి వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.
- Lakshmi 10tv
- Published On : February 23, 2024 / 03:21 PM IST
Rakul Preet Singh
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీలు ఫిబ్రవరి 21న గోవాలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. కాగా వీరి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన వారంతా వావ్ అంటున్నారు.
Payal Rajput : పాయల్ రాజ్‌పుత్ తల్లికి ఆపరేషన్.. మీ బ్లెస్సింగ్స్ కావాలంటూ ఎమోషనల్ పోస్ట్..
రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ జంట ఫిబ్రవరి 21న గోవాలో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి బాలీవుడ్ నుండి పెద్ద ఎత్తున స్టార్స్ హాజరయ్యారు. ఆనంద్ కరాజ్, సింధీ అనే రెండు ఆచారాలను పాటిస్తూ వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. కాగా వీరి పెళ్లి వీడియోను రకుల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరి వెడ్డింగ్ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. సినిమాను తలపిస్తున్న వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. బ్యూటిఫుల్ వీడియో అంటూ కొత్త జంటపై శుభాకాంక్షలు జల్లు కురిపిస్తున్నారు.
Sai Dharam Tej : ఇద్దరు చిన్నారుల ట్రీట్మెంట్ కోసం సాయి ధరమ్ తేజ్ సాయం
రకుల్ వివాహానికి బాలీవుడ్ నుండి పెద్ద ఎత్తున స్టార్స్ తరలి వెళ్లారు. తమ ప్రదర్శనలతో సందడి చేశారు. టాలీవుడ్ నుండి పెద్దగా సెలబ్రిటీలు వెళ్లలేదు. మంచు లక్ష్మి మాత్రం కనిపించారు . కాగా ఈ జంటను ఆశీర్వదిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పీఎంఓ కార్యాలయం నుండి ప్రత్యేకంగా లేఖను సైతం పంపించారు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి సెలబ్రిటీలు చేసిన సందడి అంతా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. 2021 అక్టోబర్‌లో రకుల్-జాకీ భగ్నానీ తమ ప్రేమ బంధాన్ని కన్ఫర్మ్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న పెళ్లితో ఒకటయ్యారు. రకుల్ ఇండియన్ 2 సినిమాలో నటిస్తుండగా జాకీ భగ్నానీ నిర్మించిన బడేమియా చోటేమియా సినిమా ఈద్‌కు రిలీజ్ అవుతోంది.
