Ram Charan – Rhyme : రామ్ చరణ్ తో పాటు రైమ్ మైనపు బొమ్మ కూడా.. త్వరలోనే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో..

తాజాగా అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో మేడం టుస్సాడ్స్ మ్యూజియం వాళ్ళు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Ram Charan and Rhyme Wax Statue will Place at Madam Tussauds museum Announcement Video goes Viral

Ram Charan – Rhyme : మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో వ్యాక్స్ స్టాట్యూ ఉండటం గర్వంగా భావిస్తారు. ప్రపంచంలోని అనేకమంది ప్రముఖుల మైనపు విగ్రహాలు అచ్చం వారిలాగే తయారుచేసి మేడం టుస్సాడ్స్ కి సంబంధించిన మ్యూజియమ్స్ లో పెడతారు. మన ఇండియా నుంచి కూడా అనేక మంది ప్రముఖుల మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇక టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఉండగా ఇప్పుడు రామ్ చరణ్ మైనపు విగ్రహం రాబోతుంది.

తాజాగా అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో మేడం టుస్సాడ్స్ మ్యూజియం వాళ్ళు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే రామ్ చరణ్ నుంచి కొలతలు తీసుకున్నారు. అయితే రామ్ చరణ్ మాత్రమే కాకుండా చరణ్ పెంపుడు కుక్కపిల్ల రైమ్ కి కూడా కలిపి మైనపు విగ్రహం తయారుచేయబోతున్నారు మేడం టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు.

Also Read : Prabhas – Arshad Warsi : ప్రభాస్‌ని జోకర్ అన్న బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ తాజా కామెంట్స్.. నేను ప్రభాస్‌ని అనలేదు..

దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఐఫా వేడుకల్లో ప్లే చేసారు. ఈ వీడియోలో మేడం టుస్సాడ్స్ మ్యూజియం టీమ్ చరణ్, రైమ్ ల కొలతలు, ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియోలో చరణ్ మాట్లాడుతూ.. మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో నా మైనపు విగ్రహం పెట్టడం గర్వంగా భావిస్తున్నాను. త్వరలోనే మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో కలుద్దాం అని అన్నారు. సింగపూర్ మేడం టుస్సాడ్స్ మ్యూజియం బ్రాంచ్ లో చరణ్, రైమ్ మైనపు విగ్రహం పెట్టనున్నారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే చరణ్ తో పాటు అతనితో ఎప్పుడూ ఉండే కుక్కపిల్ల రైమ్ విగ్రహం కూడా పెడుతుండటంతో ఆశ్చర్యపోతున్నారు.